Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివుడు మొదటిసారిగా సత్యనారాయణ కథను ఎవరికి చెప్పాడు? శ్రోతలు ఎవరో తెలుసా..!

వ్రత కథను చెప్పే సమయంలో శివుడు కొన్నిసార్లు పార్వతిని తన ఎడమ వైపున కూర్చోబెట్టుకున్నట్లు, కొన్నిసార్లు ఆమెను ముందు కూర్చోబెట్టుకున్నట్లు ఉంది. శ్రీమద్ భగవత్ మహాపురాణం ప్రకారం ప్రపంచంలోని మొదటి సత్య నారాయణుని వ్రత కథని శివుడు, పార్వతిదేవికి వివరించాడు. ఈ సంఘటన వేల సంవత్సరాల క్రితం అమర్‌నాథ్ గుహలో జరిగిందని నమ్మకం. స్కంద పురాణంలో పరమశివుడు ఈ కథను పార్వతికి వివరిస్తున్నప్పుడు.. అదే అమర్‌నాథ్ గుహలో ఒక పక్షి గుడ్డు పడి ఉంది.

శివుడు మొదటిసారిగా సత్యనారాయణ కథను ఎవరికి చెప్పాడు? శ్రోతలు ఎవరో తెలుసా..!
Shrimad Bhagwat Katha
Follow us
Surya Kala

|

Updated on: Jul 22, 2024 | 5:48 PM

సనాతన ధర్మాన్ని విశ్వసించే వారు సత్యనారాయణ వ్రతాన్ని జరుపుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కొత్తగా పెళ్లి అయిన దంపతులు, కొత్త ఇంట్లో .. శుభకార్యాల్లో ఇలా అనేక సందర్భాల్లో సత్య నారాయణ వ్రతాన్ని జరుపుకుంటారు. అంతేకాదు సత్యనారాయణ వ్రత కథను అప్పుడప్పుడు వినాలని పెద్దలు చెబుతారు. అయితే అత్యంత మహిమనిత్వ సత్య నారాయణుని మొదటి కథ ఎవరు చెప్పారు? ఎవరు విన్నారో? తెలుసా శ్రీమద్ భగవత్ మహాపురాణం, స్కంద పురాణం ప్రకారం సృష్టి లయకారుడైన శివుడు ఈ సత్యనారాయణ వ్రత కథను మొదట చెప్పాడు. ఈ రెండు గ్రంథాలలో పార్వతీమాత మొదటి శ్రోతగా పేర్కొంది.

ఈ సంఘటన ఈ రెండు గ్రంథాలలో శివుడు పార్వతి దేవికి కథను వివరిస్తూ ఉంటాడు. ఇలా వ్రత కథను చెప్పే సమయంలో శివుడు కొన్నిసార్లు పార్వతిని తన ఎడమ వైపున కూర్చోబెట్టుకున్నట్లు, కొన్నిసార్లు ఆమెను ముందు కూర్చోబెట్టుకున్నట్లు ఉంది. శ్రీమద్ భగవత్ మహాపురాణం ప్రకారం ప్రపంచంలోని మొదటి సత్య నారాయణుని వ్రత కథని శివుడు, పార్వతిదేవికి వివరించాడు. ఈ సంఘటన వేల సంవత్సరాల క్రితం అమర్‌నాథ్ గుహలో జరిగిందని నమ్మకం. స్కంద పురాణంలో పరమశివుడు ఈ కథను పార్వతికి వివరిస్తున్నప్పుడు.. అదే అమర్‌నాథ్ గుహలో ఒక పక్షి గుడ్డు పడి ఉంది.

శుక్ర దేవుడి జననం

ఇవి కూడా చదవండి

శివుడు సత్యనారాయణ వ్రత కథ మొదలు పెట్టగానే గుడ్డు అండంగా మారి అందులో కొంత జీవి ఊపిరి పోసుకోవడం మొదలెట్టింది. యాదృచ్ఛికంగా ఆ సమయంలోనే బలమైన గాలులు వీచాయి. ఈ గుడ్డు గాలిలో ఎగిరి గంగోత్రి సమీపంలోని కృష్ణ ద్వైపాయన వ్యాస్ ఆశ్రమానికి చేరుకుంది. ఇక్కడ ఒక వైపు వ్యాసుడు తపస్సు చేస్తుంటే, మరోవైపు అతని భార్య మాతా వితిక కూడా పూజలో కూర్చుని ఉంది. ఈ సమయంలో ఆమె మంత్రం చదవడానికి నోరు తెరచినప్పుడు ఆ గుడ్డు ఆమె నోటి ద్వారా ఆమె కడుపులోకి చేరింది. సరిగ్గా 12 నెలల గర్భంలో ఆమె శుక్ర దేవుడు జన్మించాడు. అలా శుక్రుడు శ్రీమద్ భగవత్ కథకి మొదటి ప్రతినిధి అయ్యాడు.

సత్య నారాయణ కథ అంటే ఏమిటి?

ఈ సంఘటన గురించి చర్చిస్తున్నప్పుడు సత్య నారాయణ కథ ఏమిటి అని కూడా తెలుసుకోవాలి? దీనికి సమాధానం శ్రీమద భగవత మహాపురాణం, స్కంద పురాణంలో కూడా ఉంది. ఈ రెండు గ్రంథాల ప్రకారం భగవంతుడు నారాయణుడు సత్యం.. కనుక సత్య నారాయణుని కథ అనగా శ్రీమద్ భగవత్ కథ సత్య నారాయణుని కథ. అయితే మన ఇళ్లలో కూడా అదే సత్యనారాయణ కథను చెబుతారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇళ్ళలో చెప్పే కథ అసలు కథకి పొడిగింపు మాత్రమే అని మాత్రమే చెప్పవచ్చు.

కాలక్రమంలో సత్యనారాయణ వ్రత కథను వివిధ రూపాల్లో పండితులు వినిపిస్తున్నారు. అయితే అసలు శ్రీమద భగవత కథలో దీని గొప్పతనాన్ని గురించిన వర్ణనగానీ, ఏ దేవతా స్తుతిగానీ పూజా విధానం కానీ ఇవ్వలేదు. ఇది పూర్తిగా శ్రీకృష్ణుని వివిధ రూపాలు, అతనికి సంబంధించిన వివరణ. ఈ కథను చదివి, విని, తెలుసుకున్న తర్వాత మనిషి మనసులో మృత్యుభయం తొలగిపోయి, అహంకారం నశించి, సులభంగా మోక్షం లభిస్తుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు