AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఈశాన్యం దిశకు ఎంతో ప్రాముఖ్యత.. ఈ తప్పులు అస్సలు చేయకండి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈశాన్యం మూలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈశాన్యం మూల సరిగ్గా ఉంటేనే ఇంట్లో పరిస్థితి బాగుంటుందని వాస్తు చెబుతోంది. దీనికి ప్రధాన కారణం.. ఈశాన్య దిశకు అధిపతి ఈశ్వరుడు. అందుకే ఈ దిశ ఇంటికి కీలకంగా భావిస్తారు. ఇంట్లో ఆర్థిక నష్టాలు ఉండకూడదన్నా, ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలన్నా ఈశాన్య దిశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఈశాన్యం విషయంలో...

Vastu Tips: ఇంట్లో ఈశాన్యం దిశకు ఎంతో ప్రాముఖ్యత.. ఈ తప్పులు అస్సలు చేయకండి
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Oct 24, 2023 | 12:40 PM

Share

సాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికే వాస్తు పాటించే వాళ్లు చాలా మంది ఉన్నారు. వాస్తు పాటించకపోతే ఇంట్లో మానసిక అశాంతి, ఆర్థిక నష్టాలు ఎదుర్కోక తప్పదు. అందుకే ఇంటి నిర్మాణంలో వాస్తును తప్పకుండా పాటిస్తుంటారు. అయితే ఈ వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికే పరిమితం కాకుండా ఇంట్లో ఉంచే వస్తువులకు కూడా వర్తిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఏ దిశలో ఎలాంటి వస్తువులు.? ఉండాలి.? ఏ దిశలో వస్తువుల పెట్టకూడదనే విషయాలను వాస్తు శాస్త్రంలో స్పష్టంగా తెలిపారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈశాన్యం మూలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈశాన్యం మూల సరిగ్గా ఉంటేనే ఇంట్లో పరిస్థితి బాగుంటుందని వాస్తు చెబుతోంది. దీనికి ప్రధాన కారణం.. ఈశాన్య దిశకు అధిపతి ఈశ్వరుడు. అందుకే ఈ దిశ ఇంటికి కీలకంగా భావిస్తారు. ఇంట్లో ఆర్థిక నష్టాలు ఉండకూడదన్నా, ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలన్నా ఈశాన్య దిశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఈశాన్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

* ఈశాన్యం దిశలో పూజ గది వచ్చే అవకాశం ఉంటే ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యంలో పూజ గది ఉండడం వల్ల దేవుడి ఆశీస్సులు ఉంటాయని, ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

* వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం ఎంతో పవిత్రమైన స్థలంగా భావిస్తారు. కాబట్టి ఈ దిశ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చెత్తా చెదారం లేకుండా ఉండాలి.దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది.

* ఇక ఈశాన్యం దిశలో ఎట్టి పరిస్థితిలో మరుగుదొడ్డి ఉండకుండ చూసుకోవాలి. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈశాన్యంలో బాత్‌రూమ్‌ ఉంటే ఇంట్లో కుటుంబసభ్యుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వైవాహిక జీవితంలో గొడవలు పెరుగుతాయి.

* ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఫర్నీచర్‌ ఉండకుండా చూసుకోవాలి. అలాగే స్టోర్ రూమ్‌ కూడా ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో ధన నష్టం ఉంటుంది.

* ఇక ఈశాన్య దిశలో చెప్పులు, షూస్‌, చెత్తకుండి లాంటివి ఉండకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ స్థలం వీలైనంత వరకు విశాలంగా ఉండేలా చూసుకోవాలి. వస్తువులు పెడితే ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్