AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharannava 2023: నేడు నవదుర్గ అలంకారం చంద్రఘంట.. పూజ విధానం, పాటించాల్సిన మంత్రం..

దుర్గా దేవి మూడవ రూపం చాలా సౌమ్యంగా.. ప్రశాంతంగా ఉంటుంది. మాతృ దేవత ఆరాధన అమ్మవారి భక్తుల్లో  ధైర్యం, సౌమ్యతను పెంపొందిస్తుంది. శరన్నవరాత్రుల్లో మూడవ రోజున చంద్రఘంటను పూజించే భక్తులు మనసులోని ప్రతికూలత శక్తిని తొలగిస్తూ సానుకూల శక్తిగా దేవి మారుస్తుంది. చంద్రఘంటా దేవి పూజా విధానం, మహామంత్రం మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Sharannava 2023: నేడు నవదుర్గ అలంకారం చంద్రఘంట.. పూజ విధానం, పాటించాల్సిన మంత్రం..
Navaratri 2023
Surya Kala
|

Updated on: Oct 17, 2023 | 8:17 AM

Share

సనాతన సంప్రదాయంలో శక్తి ఆరాధనకు ప్రాముఖ్యత ఉంది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవి తొమ్మిది అలంకారాల్లో పూజలను అందుకుంటారు. నేడు శరన్నవరాత్రుల్లో మూడో రోజు.. ఈ రోజు దుర్గాదేవి మూడవ రూపం చంద్రఘంట. హిందూ విశ్వాసం ప్రకారం నవరాత్రుల మూడవ రోజున చంద్రఘంట దేవిని పూజిస్తారు. దుర్గా దేవి మూడవ రూపం చాలా సౌమ్యంగా.. ప్రశాంతంగా ఉంటుంది. మాతృ దేవత ఆరాధన అమ్మవారి భక్తుల్లో  ధైర్యం, సౌమ్యతను పెంపొందిస్తుంది. శరన్నవరాత్రుల్లో మూడవ రోజున చంద్రఘంటను పూజించే భక్తులు మనసులోని ప్రతికూలత శక్తిని తొలగిస్తూ సానుకూల శక్తిగా దేవి మారుస్తుంది. చంద్రఘంటా దేవి పూజా విధానం, మహామంత్రం మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

చంద్రఘంట స్వభావం ఏమిటంటే?

హిందూ విశ్వాసం ప్రకారం దుర్గా దేవి మూడవ రూపం చంద్రఘంట దేవి. నుదుటిపై గంట గ్లాస్ ఆకారంలో ఉన్న చంద్రుడిని అలంకరించి ఉంటుంది. చంద్రుడు మనస్సుకు కారకునిగా పరిగణించబడతాడు కాబట్టి, ఈ అమ్మవారి రూపాన్ని పూజించడం ద్వారా భక్తుల మానసిక సమస్యలు రెప్పపాటులో దూరమవుతాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల సాధకునికి తెలిసి, తెలియని భయాలన్నీ తొలగిపోయి ప్రశాంతమైన మనస్సుతో, సంతోషంతో జీవితాన్ని గడుపుతాడు

చంద్రఘంట పూజా విధానం

ఈరోజు నవరాత్రులలో మూడవ రోజు చంద్రఘంటా దేవిని పూజించండి. మొదట శరీరం అభ్యంగ స్నానం చేసి మనస్సుని సంతోషంతో నింపండి. ఆపై పూజా స్థలంలో చంద్రఘంటా దేవి చిత్రాన్ని ఉంచి.. పటంపై  గంగాజలం చల్లాలి. అనంతరం అమ్మవారి చిత్రపటానికి గంధం, పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, అక్షతలు, ధూప దీపం, వస్త్రాలు, స్వీట్లు మొదలైన వాటిని సమర్పించి.. అనంతరం పూర్తి క్రతువులతో పూజించాలి. దీని తరువాత చంద్రఘటా దేవి మహిమను కీర్తిస్తూ కథను చెప్పండి. మంత్రాలను జపించండి. పూజ ముగిసిన అనంతరం నెయ్యితో దీపం వెలిగించి చంద్రఘంటా దేవికి ఆరతినివ్వండి. అనంతరం పూజలో నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని అందరికీ పంచండి.

ఇవి కూడా చదవండి

చంద్రఘంటను ఏ మంత్రంతో పూజించాలంటే

హిందూ మతంలో మంత్రాన్ని పఠించడం ఏ దేవత ఆరాధనకైనా చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో నవరాత్రుల మూడవ రోజున చంద్రఘంటా దేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి సాధకుడు ప్రత్యేకంగా దేవికి మహామంత్రాన్ని జపించాలి. హిందూ విశ్వాసం ప్రకారం రుద్రాక్ష జపమాలతో అమ్మవారి మంత్రాన్ని జపించడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈరోజు అమ్మవారి చంద్రఘంట ఆశీస్సులు పొందడానికి ఓం దేవి చంద్రఘంటాయై నమః  ప్రార్థన మంత్రాన్ని లేదా  “పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా” అనే మంత్రాన్ని పూర్తి భక్తి , విశ్వాసంతో జపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.