Sharan Navaratri Utsavalu 2023: శ్రీశైలంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం..
తొమ్మిది రోజులపాటు నిర్వహించే దసరా ఉత్సవాలకు ఆలయ ఈవో పెద్దిరాజు,ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ట్రస్ట్ సభ్యులు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా గణపతిపూజ ,శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ అఖండ దీపారాధన , వాస్తు పూజ, వాస్తు హోమం ,వివిధ విశేష పూజలు నిర్వహించి దసరా మహోత్సవాలను ప్రారంభించమని ఈవో పెద్దిరాజు తెలిపారు.
శ్రీశైలం, అక్టోబర్ 15: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహించే దసరా ఉత్సవాలకు ఆలయ ఈవో పెద్దిరాజు,ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ట్రస్ట్ సభ్యులు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా గణపతిపూజ ,శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ అఖండ దీపారాధన , వాస్తు పూజ, వాస్తు హోమం ,వివిధ విశేష పూజలు నిర్వహించి దసరా మహోత్సవాలను ప్రారంభించమని ఈవో పెద్దిరాజు తెలిపారు.
నేటి నుంచి మొదలైన దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ వాహనసేవలతో గ్రామోత్సవంగా శ్రీ స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని.. అలానే మొదటిరోజైన.. అంటే నేటి సాయంత్రం అమ్మవారు శైలిపుత్రిగా దర్శనమిస్తారని అలానే శ్రీ స్వామి అమ్మవారు బృంగివహణంపై ఆశీనులై క్షేత్ర పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈవో లవన్న తెలిపారు.
అనంతరం దేవస్థానం ఈవో పెద్దిరాజు మీడియాతో మాట్లాడుతూ దసరాకు విచ్చేయుచున్న భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగతిన దర్శనం పూర్తి చేసుకునే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశామని అలానే భక్తులకు వైద్య సదుపాయాలకు మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచామని ఈ దసరా ఉత్సవాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానించామని కానీ సీఎం వస్తారా.. రారా.. అనేది క్లారిటీ లేదన్నారు.
అలానే దసరా మహోత్సవాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని ప్రతి ఒక్క భక్తుడు శ్రీస్వామి అమ్మవారి ఉత్సవాలను వీక్షించి శ్రీ స్వామి అమ్మవార్ల కృపాకటాక్షాలు పొందాలని భక్తులను ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి