AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో నీటి విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? చేతిలో రూపాయి నిలవదు జాగ్రత్త..

చిన్న చిన్న వాస్తు లోపల వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో నీటి విషయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల ఆర్థిక పరమైన, మానసిక పరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. ఇంట్లో ట్యాపులు లీకవుతున్నా చాలా మంది పట్టించుకోరు. అయితే ఇలా లీకవడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చుక్క, చుక్క నీరు కారడాన్ని పెద్ద వాస్తు దోషంగా...

Vastu Tips: ఇంట్లో నీటి విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? చేతిలో రూపాయి నిలవదు జాగ్రత్త..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Oct 15, 2023 | 11:50 PM

Share

ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని ప్రతీ ఒక్కరూ భావిస్తురు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును గాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఇంటి పునాది నుంచి మొదలు డ్రైనేజీ వ్యవస్థ వరకు ప్రతీది వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటాఉ. అయితే కేవలం నిర్మాణం విషయంలోనే కాకుండా కొన్ని చిన్న చిన్న విషయాల్లోనూ వాస్తును పాటించాలని పండితులు చెబుతున్నారు.

చిన్న చిన్న వాస్తు లోపల వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో నీటి విషయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల ఆర్థిక పరమైన, మానసిక పరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. ఇంట్లో ట్యాపులు లీకవుతున్నా చాలా మంది పట్టించుకోరు. అయితే ఇలా లీకవడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చుక్క, చుక్క నీరు కారడాన్ని పెద్ద వాస్తు దోషంగా పరిగణిస్తున్నారు. ఇంట్లో ట్యాపుల నుంచి నీరు లీకవుతుంటే ఎంత సంపాదించినా చేతిలో నిలవదని చెబుతున్నారు. అందుకే లీకయ్యే ట్యాపులను వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు.

ఇక ఇంట్లో బోరు అందుబాటులో లేని వాళ్లు.. డ్రమ్ములు వంటి వాటిలో నీటిని స్టోర్ చేసుకొని పెడుతుంటారు. ఇలాంటి వాటిని ఉత్తర దిశలో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కుబేరుడు అధిపతి అయిన ఈ దిశలో నీరు ఎట్టి పరిస్థితుల్లో లీక్‌ కాకుండా చూసుకోవాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం లేదా పడమర దిశలో స్టోర్‌ చేసిన నీటిని ఉంచకూడదు. ఇలా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడి ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

ఇక ఇంట్లో నీటి వాలు కచ్చితంగా తూర్పు దిశగా ఉండాలి. ఇంట్లో టైల్స్‌ కడిగే సమయంలో నీరు కచ్చితంగా తూర్పు దిశగా వెళ్లాలి అలా అయితేనే అది సరైన వాస్తు. అలాంటి ఇంట్లో సంపద వృద్ధి పెరుగుతుంది. ఇలాంటి వాస్తు ఉన్న ఇంట్లో వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను విజయవంతంగా ఎదుర్కొంటారు. ఇక ఉత్తర దిశలో నీరు ప్రవాహం ఉంటే ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక సమస్యలు దరిచేరవు. నీరు ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ దిశలో ప్రవహించకూడదు. ఇది ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఇలాంటి వాస్తు ఉన్న ఇంట్లో ఉంటే ఆర్థికంగా చాలా నష్టపోతారు. చీటికి మాటికి తగాదాలు జరుగుతాయి. ఒకవేళ దక్షిణ దిశవైపు ప్రవహిస్తే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అనుకోని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఇక అన్నింటికి ఉత్తమమైన వాస్తు ప్రకారం పల్లం ఈశాన్యం వైపు ఉండాలి. ఇలా ఉంటే అదృష్టం కలిసొస్తుంది. గౌరమ, మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులంతా ప్రశాతంగా ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..