Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. గరుడవాహన సేవ టైం మార్పు.. నేటి నుంచి 23 వరకూ కొన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు..
సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ.. నేటి నుంచి 23వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అంతేకాదు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు జరగనున్న బ్రహ్మోత్సవాలు కలియుగ వైకుంఠాన్ని తలపిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మాత్సవాలను చూడాలని ప్రతి హిందువు కోరుకుంటాడు అంటే అతిశయోక్తి కాదు. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల గిరి భక్త సంద్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ.. నేటి నుంచి 23వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అంతేకాదు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించనున్నారు.
గరుడ సేవ దర్శనం కోసం
బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడసేవ, అక్టోబరు 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 19న జరుగనున్న గరుడవాహనసేవ కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమల క్షేత్రానికి చేరుకుంటారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడసేవను దర్శించుకోవడానికి గ్యాలరీలు అన్నీ నిండిపోతాయి.
సమయంలో మార్పులు
దీంతో గరుడవాహనంపై ఊరేగే స్వామివారిని ఎక్కువమంది భక్తులు దర్శించుకునే కల్పించాలనే ఉద్దేశంతో టీడీపీ వాహన సేవ సమయంలో మార్పులు చేసింది. రాత్రి 7 గంటలకు బదులుగా సాయంత్రం 6.30 గంటలకు గరుడవాహన సేవను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.
ఆగమశాస్త్రం ప్రకారం
ఆగమశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాతే రాత్రి వాహనసేవ నిర్వహిస్తారు. కాగా అక్టోబరు 19న సాయంత్రం 6.15 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. ఆ తరువాత సాయంత్రం 6.30 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా గరుడ సేవ రాత్రి 12 గంటల వరకూ కొనసాగనుంది. గతంలో రాత్రి 9 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుండగా, ఆ సమయాన్ని రాత్రి 7 గంటలకు మార్చారు. ప్రస్తుతం ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు గరుడసేవ సమయాన్ని అరగంట ముందుకు తీసుకుని వచ్చారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..