Sangameswara Temple: కృష్ణమ్మ నీటి మట్టం తగ్గుముఖం.. సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుడు త్వరలో భక్తులకు దర్శనం
సంగమేశ్వర వేపదారు శివలింగంకు తొలిపూజలను నిర్వహించడానికి రెడీ అవుతున్నామని ప్రధాన అర్చకులు తెలకపలి రఘురామశర్మ చెప్పారు. గత సంవత్సరం జులై నెలలో కృష్ణా జలాల్లో మునిగిన సంగమేశ్వర ఆలయం మళ్ళీ ఏడు నెలల తరువాత భక్తులకు దర్శనం ఇవ్వనున్నది.
క్రమంగా సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. మరో వారం రోజుల్లో భక్తులను అనుగ్రహించనున్నాడు. అవును. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం ఈ సంగమేశ్వర దేవాలయం. సప్తనదీ సంగమ ప్రదేశంలో వెలసిన సంగమేశ్వరాలయం కృష్ణానదీ జలాల నుంచి నెమ్మదిగా బయల్పడుతోంది. గత కొన్ని రోజులుగా కృష్ణానదిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో.. సంగమేశ్వరాలయం ప్రాంగణం క్రమంగా బయల్పడుతుంది. ప్రస్తుతం సంగమేశ్వర దేవాలయం కృష్ణా నది నీటి నుంచి సగం వరకు కనపడుతు అద్భుతంగా కనువిందు చేస్తోంది. మరో పది రోజుల్లోనే ఆలయం పూర్తిస్థాయిలో బయటపడి గర్భాలయంలోని వేపదారు శివలింగ దర్శన భాగ్యం భక్తులకు కలిగే అవకాశం ఉంది. సంగమేశ్వర వేపదారు శివలింగంకు తొలిపూజలను నిర్వహించడానికి రెడీ అవుతున్నామని ప్రధాన అర్చకులు తెలకపలి రఘురామశర్మ చెప్పారు. గత సంవత్సరం జులై నెలలో కృష్ణా జలాల్లో మునిగిన సంగమేశ్వర ఆలయం మళ్ళీ ఏడు నెలల తరువాత భక్తులకు దర్శనం ఇవ్వనున్నది.
శైవాలయాల్లో సంగమేశ్వరాలయానిది ప్రత్యేక స్థానం. ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం.. నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. అయితే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం భక్తులకు దర్శనమిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు.
ఈ ఆలయంలోని చెక్క శివలింగం ఏడాదికి దాదాపు ఎనిమిది నెలల పాటు మునిగిపోయినప్పటికీ పాడైపోదు. సంగమేశ్వరం శ్రీశైలానికి ‘వాయువ్య ద్వారం’గా పరిగణించబడుతుంది. కృష్ణా, వేణి, తుంగభద్ర, భీమరధి, మలాపహారిణి, సంగమేశ్వర, భవనసాని అనే ఏడు నదుల సంగమ ప్రదేశం. ఈ క్షేత్రంలో సూర్య, మృత్యుంజయ, సరస్వతి, సుబ్రహ్మణ్య, ఆంజనేయ, నరసింహ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే ఆత్మకూర్ నుంచి కపిలేశ్వరం వరకు బస్సులో వెళ్లాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..