Statue Of Equality: నేడు సమతామూర్తిని సందర్శించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

Ram Nath Kovind - Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేడు హైదరాబాద్‌కు రానున్నారు. శంషాబాద్ ముచ్చింతల్‌

Statue Of Equality: నేడు సమతామూర్తిని సందర్శించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
Presidemt
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 13, 2022 | 3:00 AM

Ram Nath Kovind – Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేడు హైదరాబాద్‌కు రానున్నారు. శంషాబాద్ ముచ్చింతల్‌ (Mucchinthal) లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది (Ramanuja Sahasrabdi) సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతోపాటు భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరించనున్నారు. ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో రామ్‌నాథ్ కోవింద్ దాదాపు రెండు గంటలపాటు సందర్శించనున్నారు. శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ అనంతరం సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ఆడిటోరియంలో ప్రసంగించనున్నారు.

రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇలా..

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జీయర్ ఆశ్రమానికి మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారు. అనంతరం శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ, సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు. దాదాపు రెండు గంటల పర్యటనలో సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ప్రత్యేక పూజలు, ఆలయలను సందర్శించనున్నారు. ప్రసంగం అనంతరం 5 గంటలకు జీయర్ ఆశ్రమం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్ నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సైబాబాద్ పోలీస్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో ఎవరిని అనుమతించమని పేర్కొంది.

Also Read:

Assam CM On CM KCR: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్.. ఏమన్నారంటే..?

CM KCR Speech Updates: కేంద్రం అవినీతి చిట్టా అందింది.. పీఎం మోదీపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.