Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru Paksham 2022: మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ? అయితే మీ పూర్వీకులు చాలా కోపంగా ఉన్నారట.. ఎలాగంటే..

హిందూ ధర్మంలో పితృ పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులను పూజించడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. మరణించిన బంధువులందరికీ.. వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

Pitru Paksham 2022: మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ? అయితే మీ పూర్వీకులు చాలా కోపంగా ఉన్నారట.. ఎలాగంటే..
Pitru Paksha
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 08, 2022 | 5:24 PM

పితృ పక్షంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ ఏడాది పితృ పక్షం 10 సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభమవుతుంది. భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమనిపేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. 25 సెప్టెంబర్ 2022 న సర్వపిత్రి అమావాస్యతో ముగుస్తుంది. హిందూ ధర్మంలో పితృ పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులను పూజించడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది.

దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజులనే పుర్వీకుల రోజులు అని అంటారు. అంటే మరణించిన బంధువులందరికీ.. వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. తమ పూర్వీకులను స్మరించుకోనప్పుడు లేదా వారిని పూజించకపోతే.. వారు కూడా కోపంగా ఉంటారు. పూర్వీకులు కోపంగా ఉండటం చాలా అశుభం. అటువంటి పరిస్థితిలో.. మీ పూర్వీకులు మీపై చాలా కోపంగా ఉన్నారని మీకు తెలియజేసే సంకేతాల గురించి ఇవాళ  మనం తెలుసుకుందాం.

ఇంట్లో గొడవలు పెరగడం-

మీ ఇంట్లో గొడవలు, విద్వేషాలు ఎక్కువగా ఉంటే పితృ దోషం ఉండటానికి కారణం కావచ్చు.

పనిలో ఆటంకాలు- 

ఏదైనా పని చేస్తున్నప్పుడు అడ్డంకులు ఏర్పడినా లేదా కష్టపడి పని చేసినా విజయం సాధించకుంటే మీ పూర్వీకులకు  మీపై కోపంతో ఉన్నారని అర్థం.

పిల్లలకు సంబంధించిన అడ్డంకులు – 

మీ బిడ్డ మీ మాట వినకపోతే లేదా శత్రుత్వం కలిగి ఉంటే.. తండ్రి మీపై కోపంగా ఉన్నారని అర్థం. పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు.. ఇలాంటి సంకేతాలు కనిపిస్తుంటాయి.

వివాహంలో అడ్డంకులు- 

మీ వివాహంలో అడ్డంకులు ఏర్పడినా లేదా వివాహ విషయం చెడిపోయినా లేదా మీరు వైవాహిక జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే.. అది పితృ దోషానికి కారణం కావచ్చు.

అకస్మిక నష్టం..

మీకు ఏదైనా పనిలో అకస్మాత్తుగా నష్టం కలిగినా లేదా ఇంటి సభ్యులు పదే పదే ప్రమాదాలకు గురవుతున్నారంటే మీ పూర్వీకులకు మీపై చాలా కోపంతో ఉన్నారని అర్థం..

మీ పూర్వీకులు సంతోషించాలంటే ఇలా చేయండి..

చిత్రపటం పెట్టండి-

ఇంట్లో పూర్వీకుల చిరునవ్వుతో కూడిన చిత్రాన్ని పెడితే మీ పూర్వీకులు సంతోషిస్తారు. అయితే ఇంటి నైరుతి గోడ లేదా మూలలో పూర్వీకుల చిత్రపటాన్ని ఉంచడం మంచిది. దీనివల్ల పూర్వీకుల నుంచి విశేష ఆశీస్సులు లభిస్తాయి.

ఉదయం లేవగానే..

ఉదయం లేవగానే పూర్వీకులకు నమస్కరించి మీకు అందుబాటులో ఉండే పుష్పాలను వారి చిత్రపటంపై పెట్టండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు ఎంతో సంతోషిస్తారని నమ్మకం.

పూర్వీకుల ప్రత్యేక రోజులను జరుపుకోండి-

పూర్వీకుల జన్మదినోత్సవం, వార్షికోత్సవం వంటి ప్రత్యేక రోజులను జరుపుకోవడం కూడా చాలా మంచిది. దీని కారణంగా పూర్వీకులు సంతోషిస్తారు. ఈ ప్రత్యేక రోజులలో పేదలకు అన్నదానం చేయండి. దీంతో పూర్వీకుల ఆశీస్సులు మీపై ఉంటాయి.

దానం –

పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి అవసరమైన వ్యక్తికి ఆహారం, బట్టలు, బూట్లు, చెప్పులు, డబ్బు మొదలైన వాటిని దానం చేయడం చాలా మంచిది. దీని వల్ల పూర్వీకులు చాలా సంతోషంగా ఉంటారు.

చేయలేని పక్షంలో ఇలా కూడా చేయవచ్చు..

ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.

ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ కర్మలను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం