AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో జన్మించిన వారు ధైర్యవంతులు.. వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట.. మీరు కూడా ఇందులో ఉన్నారో చెక్ చేసుకోండి..

న్యూమరాలజీ ప్రకారం, రాడిక్స్ 3లోని వ్యక్తులు ధైర్యంగా ఉంటారు. నిర్భయంగా ఉంటారు. స్వభావంలో కూడా చాలా మొండిగా ఉంటారు. వీరిని పాలించే గ్రహం..

Numerology: ఈ తేదీల్లో జన్మించిన వారు ధైర్యవంతులు.. వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట.. మీరు కూడా ఇందులో ఉన్నారో చెక్ చేసుకోండి..
Number 3 As Psychic Number
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2022 | 11:36 AM

Share

న్యూమరాలజీ కూడా జ్యోతిష్యంలో ఒక విభాగం. న్యూమరాలజీ ద్వారా ప్రతి వ్యక్తి తన భవిష్యత్తుతోపాటు తన స్వభావం గురించి కూడా తెలుసుకోవచ్చు. దీని గురించి తెలుసుకున్న తర్వాత.. ఒక వ్యక్తి తన లోపాలను సరిదిద్దవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. దీని కోసం రాడిక్స్ నెంబర్ అవసరం. రాడిక్స్ నెంబర్ అంటే ఆ వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించబడుతుంది. అయితే..రాడిక్స్ 3 గణన ఎలా లెక్కిస్తారనేది కూడా చాలా ముఖ్యం. ఈ లెక్కింపు ఎలా చేస్తారంటే.. నెలలో 03, 12, 21 లేదా 30 తేదీలలో జన్మించిన వ్యక్తి రాడిక్స్ 3గా పరిగణించబడుతుంది. రాడిక్స్ 3 కలిగిన వారు స్థానికులు ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. వారికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉంటుంది.

రాడిక్స్ సంఖ్య 3 స్వభావం..

నాయకత్వ లక్షణాలతోపాటు రాడిక్స్ 3లోని వ్యక్తులు శాంతిని ఇష్టపడేవారుగా ఉంటారు. మృదుహృదయం కలవారు. మృదువుగా మాట్లాడేవారు, స్వభావంతో సత్యవంతులు. వీరికి అబద్ధాలు నచ్చవు. వారి జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వారికి జీవితంలో దేనికీ లోటు ఉండదు. అంటే సంతోషం, ధనం, ఐశ్వర్యం ఇలా ఉంటాయి.

రాడిక్స్ సంఖ్య కలిగిన పూజ్యమైన దేవత

రాడిక్స్ 3 కలిగిన వారి అధిపతి బృహస్పతిగా పరిగణించబడుతుంది. బృహస్పతి దేవతలకు గురువు.. ఈ రాడిక్స్ కలిగినవారికి దేవ గురువు బృహస్పతి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఆయన ఆశీస్సులు ఈ వ్యక్తులపై ఉండటం వల్ల దేవతల ఆశిస్సులు కూడా నేరుగా అందుతాయి. వీరు ఏ దేవుడిని ప్రార్థించినా ఫలితాలు త్వరగా నెరవేరుతాయి. రాడిక్స్ 3 తెలివైనవారుగా ఉంటారు.

రాడిక్స్ 3 అదృష్ట రంగు..

న్యూమరాలజీ ప్రకారం, రాడిక్స్ 3 ఉన్నవారికి పసుపు, ఊదా, నీలం, ఎరుపు, గులాబీ రంగులు చాలా శుభప్రదంగా పరిగణించబడతాయి. ఇలాంటి వ్యక్తులు ఈ రంగు దుస్తులు ధరించి ఏ పనిని ప్రారంభించినా అందులో విజయం సాధిస్తారని నమ్మకం.

అదృష్ట దినం : గురువారం  

శుభ తేదీ : 3వ, 6వ మరియు 9వ తేదీలు వారికి శుభప్రదం..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం