Shakuni Temple: మనదేశంలో శకునికి ఆలయం.. శకుని మంచివాడే అంటూ ఆదివాసులు పూజలు..పొంగల్, కల్లు నైవేద్యం
Shakuni Temple: సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతనికి(Kharma Siddhantam) ప్రత్యేక స్తానం ఉంది. కర్మానుసారమే మనిషి జీవిత విధానం ఏర్పడుతుందని కర్మ సిద్ధాంతం చెపుతుంది. విధిని అనుసరించి కర్మ నడుస్తుంది..
Shakuni Temple: సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతనికి(Kharma Siddhantam) ప్రత్యేక స్తానం ఉంది. కర్మానుసారమే మనిషి జీవిత విధానం ఏర్పడుతుందని కర్మ సిద్ధాంతం చెపుతుంది. విధిని అనుసరించి కర్మ నడుస్తుంది. అయితే మహాభారతంలో కర్మ మనిషి జీవితంపై ప్రభావం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు అనేక సార్లు వివరించాడు. ఇక దుష్ఠడు అనగానే మహాభారతంలోని శకునిని వెంటనే గుర్తుకు తెచ్చుకుంటారు. మేధస్సు కలిగిన ఒక స్వార్థపరునిగా భావిస్తారు. అయితే స్థితికారకుడైన మహావిష్ణువు శ్రీ కృష్ణునిగా అవతరించి చేసిన లీలలు అనేకం. కృష్ణుని లీలలలో శకుని కూడా ఒక భాగం. కౌరవుల పక్షాన నిలబడి.. జూదరూపంలోని దుర్మార్గుల వినాశనానికి కారణమైనవాడు శకుని. అయితే శకునితో ఆ చేయించిన సూత్రధారి కృష్ణుడు. ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏర్పాటు చేసిన కర్మ సాధనంగా ఉపయోగపడిన వ్యక్తి శకుని. అటువంటి శకుని మామకు మన దేశంలో ఆలయం ఉంది. అక్కడ ఉత్సవాలను ఘనంగా చేస్తారు. శకుని గురించి ఆలయం విశిష్ట తెలుసుకుందాం..
నిజానికి శకుని గొప్ప శివభక్తుడు. గాంధారదేశ రాజకుమారుడు. అలనాటి గాంధారమే ఇప్పటి ఆఫ్గన్ స్ధాన్. ఆదేశపు రాజు సుబలనుని నూరవ పుత్రుడు శకుని. సుబలనుని సంతానంలో శకుని, గాంధారిమాత్రమే బతికారు. గాంధారీకి తమ్ముడు కౌరవులకు మేనమామ. శకుని కొడుకు ఉలూకుడు. కురు పితామహుడైన భీష్మునితో గల వైరం వలన తన పగ తీర్చుకునేందుకు కౌరవులతో బంధం ఏర్పరుచుకుని కురువంశ సమూలనాశనానికి కారకుడై తన చిరకాల పగ తీర్చుకున్నాడు. చివరికి కురుక్షేత్ర సంగ్రామంలో సహదేవుని చేతిలో హతమయ్యాడు.
స్థలపురాణం:
కేరళ రాష్ట్రంలో శకునికి ఆలయం నిర్మించబడి భగవంతునిగా పూజించబడు తున్నాడు. పాండవుల అజ్ఞాతవాస సమయంలో కౌరవులు వారికోసం దేశాలన్నీ గాలించి వారిని తుదముట్టించాలని ఆశించారు. అందుకోసం ఈనాటి కేరళ ప్రాంతంలో ‘పగుత్తీశ్వరమ్’ ప్రాంతంలో ఆయుధాలు రహస్యంగా దాచివుంచారు. ఆ ప్రాంతమే వాడుకలో ‘పవిత్రేశ్వరం’ గా పిలువబడుతోంది. ‘పవిత్రేశ్వరం’ సరిహద్దులలో…’మాయంగోడుమాలన్ సరవుమలనడా’ అనే ఆలయం వున్నది. ఈ ఆలయంలో ప్రధాన దైవం ‘శకుని’. భీష్ముని పై ప్రతీకారం కోసం తాను చేసిన పాపాలకు ఆవేదనచెందిన శకుని, ప్రాయశ్చిత్తంగా ఈ ఆలయంలోని ఈశ్వరుడి గురించి తపస్సు చేశాడని, అప్పుడు పరమశివుని అనుగ్రహంతో మోక్షం పొందాడని స్ధలపురాణం.
ఆలయ నిర్మాణం: ఈ ఆలయంలో భువనేశ్వరిదేవి, నాగరాజు ఉపదేవతలు. శకుని ఆలయానికి ప్రహారీగోడలు మాత్రమే ఉంటాయి. పై కప్పు గాని, తలుపులు కానీ ఉండవు. భక్తులు అన్ని వేళలా దర్శనం చేసుకుంటారు. శకుని విగ్రహం సమీపంలో ఒకగద ఉంది. ఆ విగ్రహానికి ఎదురుగా వున్న ఒక వేదిక పై భక్తులు తాము తెచ్చిన పూజా సామాగ్రి, ప్రసాదం నైవేద్యంగా పెడతారు.
ఉత్సవాలు: శకుని మంచివాడే. పరిస్థితుల ప్రాబల్యంతో తప్పులు చేశాడని కొన్ని తెగల ప్రజలు శకునిని పూజిస్తారు. ఈ ప్రాంతంలోని దొమ్మరి జాతి వారు శకుని తమను కాపాడే దైవంగా నమ్మి పూజలు ఉత్సవాలు జరుపుతారు. పగవారి వలన తమకు ఎటువంటి బాధలు కలుగకూడదని శకునిని వేడుకుంటారు. పొంగల్ ను నైవేద్యంగా పెడతారు. పువ్వులు, పండ్లు, కల్లు, పట్టు వస్త్రాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి అర్చనలు చేసి పూజిస్తారు. ఈ ఆలయ నిర్వహణా బాధ్యతను ఆదివాసుల, దేశదిమ్మరుల కుటుంబాలవారు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మే మాసాలలో భారీ ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో జనాలు ఉత్సాహంగా పాల్గొంటారు.
శకుని ఆలయానికి ఎలా చేరుకోవాలంటే: ఈ పవిత్రేశ్వరం కేరళలోని కొల్లం జిల్లా కొట్టారక్కర తాలూకాలో ఉంది. తిరువనంతపురం నుండి 64 కి.మీ దూరం, కొల్లం నుండి 42 కి.మీ దూరం. కొట్టారక్కరా నుండి 13 కి.మీ ప్రయాణంచేసి.. శకుని ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
Chittoor District: చిత్తూరు జిల్లాలో గాలి వాన బీభత్సం.. భారీగా ఆస్థి, పంట నష్టం..