దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి..?

దసరా పండుగ విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. భారతదేశమంతటా.. ఈ దసరా పండుగను ఘనంగా జరుపుకుంటూంటారు. ఈ దసరానే విజయదశమి అని కూడా అంటారు. రావణుడిపై రాముడి విజయం సాధించినందుకు.. దక్షిణాది రాష్ట్రాల్లో దసరాని జరుపుకుంటూంటారు. అలాగే.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో.. రాక్షసుల రాజు.. మహిషాసురిడిని అంతమొందించి.. దుర్గమ్మ.. విజయం సాధించినందుకు విజయదశమిని చేసుకుంటూంటారు. అయితే.. ఈ పండుగ రోజున.. పాలపిట్టను చూస్తే మంచిదని.. నానుడి. విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగటాన్ని ఎంతో అదృష్టంగా, శుభ […]

దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2019 | 5:58 PM

దసరా పండుగ విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. భారతదేశమంతటా.. ఈ దసరా పండుగను ఘనంగా జరుపుకుంటూంటారు. ఈ దసరానే విజయదశమి అని కూడా అంటారు. రావణుడిపై రాముడి విజయం సాధించినందుకు.. దక్షిణాది రాష్ట్రాల్లో దసరాని జరుపుకుంటూంటారు. అలాగే.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో.. రాక్షసుల రాజు.. మహిషాసురిడిని అంతమొందించి.. దుర్గమ్మ.. విజయం సాధించినందుకు విజయదశమిని చేసుకుంటూంటారు. అయితే.. ఈ పండుగ రోజున.. పాలపిట్టను చూస్తే మంచిదని.. నానుడి.

విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగటాన్ని ఎంతో అదృష్టంగా, శుభ సూచికంగా ప్రజలు భావిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే.. జమ్మి చెట్టు ఎలా గుర్తుకువస్తుందో.. పాలపిట్ట కూడా.. అలాగే గుర్తుకు వస్తుంది. గుప్పెడంత ఉండే ఈ పాలపిట్టను.. విజయదశమి రోజున మొక్కాల్సిందే. దీన్ని ఆరోజు చూడటం వల్ల అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతీ పని విజయవంతం అవుతుందని.. భక్తుల విశ్వాసం.

కాగా.. ఇంతకీ ఈ పాలపిట్టను దసరా రోజే ఎందుకు చూడాలి..? అనే ప్రశ్న వచ్చింది కదా..! దీనికి కూడా ఓ చరిత్ర ఉంది. పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని.. రాజ్యానికి తిరిగి వస్తుండగా.. ఈ పాలపిట్ట కనబడిందట. అప్పటి నుంచీ వారికి విజయాలు సిద్ధించాయని.. ఓ జానపద కథ. అందుకే విజయదశమి రోజున పాలపిట్టను చూడాలి.. అంటూంటారు పెద్దలు. అంతాబాగానే.. ఉన్నా.. ప్రస్తుతం ఈ పక్షి జాడ అసలు కనిపించడమే లేదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో.. ఈ పక్షులు కనుమరుగయిపోయాయి.