దసరా: ఏ అమ్మవారికి.. ఏ నైవేథ్యం పెడతారు..?
దసరా పండుగ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో భాగంగా.. అలంకారాలు ఒక్కోరోజు ఓక్కో విధంగా ఉంటాయి. దేవీ వివిధ అవతారాలకు ప్రతీరోజు ప్రసాదం విభిన్నంగా ఉంటుంది. దసరా అనే పేరు ‘దశహరా’కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని కూడా అర్థం. శత్రువులను చెంఢాడుతూ.. భీకరమైన రూపంలో ఉన్న అమ్మవారిని శాంతిపజేస్తూ.. దసరా పండుగను చేస్తారు. దసరా పండుగకు […]
దసరా పండుగ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో భాగంగా.. అలంకారాలు ఒక్కోరోజు ఓక్కో విధంగా ఉంటాయి. దేవీ వివిధ అవతారాలకు ప్రతీరోజు ప్రసాదం విభిన్నంగా ఉంటుంది. దసరా అనే పేరు ‘దశహరా’కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని కూడా అర్థం. శత్రువులను చెంఢాడుతూ.. భీకరమైన రూపంలో ఉన్న అమ్మవారిని శాంతిపజేస్తూ.. దసరా పండుగను చేస్తారు. దసరా పండుగకు ముందు తొమ్మిది రోజుల్లో.. అమ్మవారి 9 రూపాలను భక్తులు ఆరాధిస్తారు.
కాగా.. ఈ శరన్నవరాత్రులకు ఇంద్రకీలాద్రి.. విజయవాడలో కూడా.. ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజులూ.. ఒక్కో రూపంలో.. అమ్మవారిని అలంకరిస్తారు. నవరాత్రుల్లో.. బెజవాడ గుడి కిటకిటలాడుతూంటుంది. ముందుగా.. విజయవాడలోని దుర్గమ్మకు పూజలు నిర్వహించిన తరువాతనే.. మిగతా ఆలయాల్లో పూజలను చేస్తారు.
ఈ నెల 28తోనే దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. దీంతో.. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూంటాయి. అలాగే.. ప్రత్యేక పూజలు, దీపాలంకరణ, అవతారాలు కూడా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా.. కొన్ని ఆలయాల్లో.. అమ్మవారి అనుగ్రహం కోసం.. భక్తులచే.. కుంకుమ పూజలు నిర్వహిస్తూంటారు. అలాగే.. కొందరు భక్తులు ఇళ్లల్లో కూడా.. అమ్మవారిని ప్రతిష్టించి.. 9 రోజులపాటు పూజలు చేశారు. కాగా.. శరన్నవరాత్రుల్లో ప్రత్యేకమైన నైవేధ్యాలను కూడా.. అమ్మవారికి చేసి పెడుతూంటారు. మరి.. ఏ అలంకారంలో ఉన్న అమ్మవారికి ఏ ప్రసాదాలు ఇష్టమో.. తెలుసుకుందామా..!
మొదటి రోజు: శ్రీ బాల త్రిపుర సుందరీ, పొంగల్ రెండవ రోజు: గాయత్రీ దేవి, పులిహోర మూడవ రోజు: అన్నపూర్ణా దేవి, కొబ్బెరి అన్నం
నాల్గవ రోజు: కాత్యాయనీ దేవి, అల్లం గారెలు ఐదవ రోజు: లలితా దేవి, దద్ధోజనం (పెరుగన్నం) ఆరవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి, రవ్వ కేసరి ఏడవ రోజు: మహా సరస్వతి దేవి, కదంబం ఎనిమిదవ రోజు: మహిషాసుర మర్ధిని, బెల్లం అన్నం తొమ్మిదవ రోజు: రాజరాజేశ్వర దేవి, పరమాన్నం