Navratri 2025: నవరాత్రికి ముందు ఈ వస్తువులను ఇంటికి తీసుకురండి.. అమ్మవారి ఆశీస్సులు మీ సొంతం
ఈ ఏడాది దేవీ నవరాత్రి సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రిలోని 9 రోజులు దుర్గాదేవి ప్రత్యేక పూజకు అంకితం చేయబడ్డాయి. నవరాత్రికి ముందు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులను పొందవచ్చని నమ్ముతారు.

నవరాత్రి పండుగను సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటారు. వసంత ఋతువులో చైత్ర నవరాత్రి, ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు, శరదృతువులో జరుపుకునే శారదీయ నవరాత్రులు, శీతాకాలంలో జరుపుకునే మాఘ నవరాత్రులు. ఈ నాలుగింటిలో శారదయ నవరాత్రులు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ నవరాత్రి వేడుకలను దేశవ్యాప్తంగా చాలా వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రిలో 9 రోజులు దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. నవరాత్రి సమయంలో అమ్మవారిని పూజించడం, ఉపవాసం ఉండటం ద్వారా అమ్మవారు సంతోషంతో ఆశీర్వదిస్తుందని చెబుతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం దుర్గాదేవికి చాలా ప్రియమైనవిగా భావించే కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు నవరాత్రికి ముందు ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే దుర్గాదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు. నవరాత్రికి ముందు ఏ శుభ వస్తువులను ఇంటికి తీసుకురావాలో తెలుసుకుందాం..
నవరాత్రికి ముందు ఏమి కొనాలంటే
- నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు వెండి నాణెం, కలశం, తామర పువ్వు, దుర్గామాత విగ్రహం లేదా చిత్రం, శ్రీ యంత్రం, 16 అలంకరణ వస్తువులు, ఎర్ర చందనపు దండను తీసుకురావచ్చు. ఈ వస్తువులన్నీ ఆనందం, శ్రేయస్సు, సంపద రాకకు చిహ్నాలుగా పరిగణించబడుతున్నాయి.
- వెండి నాణెం: దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. నవరాత్రి సమయంలో వెండి నాణెం తీసుకురావడం వల్ల ఇంట్లో సంపద, శ్రేయస్సు వస్తుంది.
- కలశం: కలశం ఏర్పాటు నవరాత్రిలో ఒక ముఖ్యమైన భాగం. మట్టి కుండ, ఇత్తడి, వెండి లేదా బంగారంతో చేసిన కలశాన్ని ఇంట్లోకి తీసుకురావడం శుభప్రదం. ఇది శుభ ఫలితాలను తెస్తుందని అంటారు.
- దుర్గాదేవి విగ్రహం లేదా చిత్రం:- నవరాత్రి సమయంలో మీరు దుర్గాదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ఇంటికి కూడా తీసుకురావడం శుభప్రదం. పూజ గదిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని, వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
- శ్రీ యంత్రం: మత విశ్వాసం ప్రకారం నవరాత్రికి ముందు ఇంట్లో శ్రీ యంత్రాన్ని తీసుకురావడం చాలా శుభప్రదం. ఇది సంపద, విజయాన్ని తెస్తుందని చెబుతారు.
- 16 అలంకరణ వస్తువులు: మహిళలు అదృష్టాన్ని పొందడానికి దీర్ఘ సుమంగళిగా ఉండడానికి నవరాత్రికి ముందు 16 అలంకరణ వస్తువులను ఇంటికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.
- ఎర్ర చందన జపమాల: దుర్గామాత మంత్రాలను జపించడానికి ఎర్ర చందన జపమాల శుభప్రదంగా పరిగణించబడుతుంది. దానిని ఇంట్లోకి తీసుకురావడం వల్ల దుర్గామాత ఆశీస్సులు లభిస్తాయి.
నవరాత్రి ముందు ఇంటి నుంచి ఈ వస్తువులను తొలగించండి
- విరిగిన వస్తువులు: నవరాత్రి ప్రారంభానికి ముందు, బూట్లు, చెప్పులు, గాజు పాత్రలు వంటి పాత, విరిగిన వస్తువులను ఇంటి నుంచి తొలగించాలి.
- పాత విగ్రహాలు, చిత్రాలు: నవరాత్రి సమయంలో ఇంట్లో ఏ విధమైన దెబ్బతిన్న లేదా విరిగిన విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచకూడదు.
- జుట్టు, గోళ్లను కత్తిరించుకోవద్దు: నవరాత్రి సమయంలో గడ్డం, జుట్టు , గోళ్లను కత్తిరించడం నిషేధం. కనుక నవరాత్రులు ప్రారంభానికి ముందుగానే ఈ పనులు చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








