Navratri 2021: దుర్గాదేవిని ఆవాహన చేస్తూ.. పూజారి ఛాతీపై 21 కలశాల స్థాపన.. ఎక్కడంటే

Navratri 2021:  దేవి నవరాత్రుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని ఒక్కక్క ప్రాంతంలో ఒక్క రూపంలో పూజిస్తారు. దుర్గాదేవిని ఆవాహన చేస్తూ..

Navratri 2021: దుర్గాదేవిని ఆవాహన చేస్తూ.. పూజారి ఛాతీపై 21 కలశాల స్థాపన.. ఎక్కడంటే
Navaratri Festival
Follow us
Surya Kala

|

Updated on: Oct 08, 2021 | 5:23 PM

Navratri 2021:  దేవి నవరాత్రుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని ఒక్కక్క ప్రాంతంలో ఒక్క రూపంలో పూజిస్తారు. దుర్గాదేవిని ఆవాహన చేస్తూ కలశస్థాపన చేసి నవరాత్రుల్లో ఈ కలశాన్ని పూజిస్తారు. అయితే బీహార్ లోని  నవలోఖా ఆలయం లో మాత్రం కలశ స్దాన వెరీ వెరీ స్పెషల్దే. దుర్గాదేవిని ఆవాహన చేస్తూ.. ఆలయ పూజారి తన ఛాతీపై తొమ్మిది కలశాలను ఉంచుకుని నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు.

పాట్నా నవలోఖా ఆలయం లో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ పూజారి నాగేశ్వర్ తన ఛాతిపై కలశాలను ఒకదానిపై ఒకటి పెట్టి అలా 21 కలశాలను ఉంచుకుంటారు.  తాను ఇలా గత 25 ఏళ్లుగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను చేస్తున్నానని ఆలయ పూజారి బాబా బాబానాగేశ్వర్ చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళి విముక్తి పొందాలని అమ్మవారిని కోరుకుంటూ నవరాత్రి తొమ్మిది రోజులు దుర్గమ్మ పాదాల  చెంత పడుకుంటానని చెప్పారు. అంతేకాదు ప్రపంచంలో మంచి గెలవాలి, చెడు ఓడిపోవాలి.. మొత్తం  మొత్తం ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలతో ఉండలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదే విషయంపై ఆలయ నిర్వాహకులు విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ నవరాత్రి తొమ్మిది రోజులు పూజారిని తాము చూసుకుంటామని చెప్పారు. ఇక ఆలయ ఉత్సవాలను కూడా కరోనా నిబంధనలను అనుసరిస్తూ నిర్వహిస్తున్నామని తెలిపారు.

శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని.. శక్తి స్వరూపిణిగా తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు.  తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి భక్తులు అమ్మవారిని పూజించి ఉపవాస దీక్షను ఉంటారు. దుర్గామాత మహిషాసురుడిపై విజయం సాధించినందుకు గుర్తుగా చెడుపై మంచి సాధించిన విజయం అంటూ దసరాగా పండగను జరుపుకుంటారు.  ఈఏడాది నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 వరకు సాగుతాయి.

Also Read: వంటలక్కకు షాక్ ఇస్తున్న ప్రేక్షకులు.. రోజు రోజుకీ తగ్గుతున్న టీఅర్ఫీ రేటింగ్.. రేసులోకి వచ్చిన గుప్పెడంత మనసు..

 రేపు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు.. నైవేద్యంగా కొబ్బరి అన్నం.. ఎలా తయారు చేసుకోవాలంటే

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!