Maha Shivaratri: శివుడిని బిల్వపత్రాలతోనే ఎందుకు పూజిస్తారు.. మొదట ఎవరు కొలిచారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..
ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి, ఫిబ్రవరి 18న శనివారం నాడు మహాశివరాత్రి పండుగను దేశ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి భోలేనాథ్‌ను పూజించడం ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకుంటారు.

ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి, ఫిబ్రవరి 18న శనివారం నాడు మహాశివరాత్రి పండుగను దేశ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి భోలేనాథ్‌ను పూజించడం ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకుంటారు. శివ పురాణం ప్రకారం, శివుడు ఈ రోజున దివ్య జ్యోతిర్లింగ రూపంలో కనిపించాడు.
మత గ్రంథాలలో, జ్యోతిర్లింగాలను శివుని శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజు రుద్రాభిషేకం చేయడం కూడా చాలా ముఖ్యం. దీని వలన సంతోషం-శ్రేయస్సు, సంతానం, సంపదతోపాటు కోరుకున్న ఫలాలు లభిస్తాయని నమ్ముతుంటారు. అలాగే, గ్రహ దోషాలు, వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. శివలింగం ఉన్న 12 ప్రదేశాలలో శివుడు స్వయంగా కాంతి రూపంలో కూర్చున్నాడని మత గ్రంధాలలో వివరించారు. వీటిని జ్యోతిర్లింగాలుగా పిలుస్తారు.
గుజరాత్‌లో సోమనాథ్, నాగేశ్వర్, ఆంధ్రాలో మల్లికార్జున, మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వరం, ఓంకారేశ్వర్, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, మహారాష్ట్రలోని భీమశంకర్, ఘృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని విశ్వనాథ్, జార్ఖండ్‌లోని వైద్యనాథ్, తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగాలు ప్రధాన పుణ్యక్షేత్రాలు.




బిల్వపత్రం సమర్పించే సంప్రదాయం..
పురాణాల ప్రకారం, పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేసి ఉపవాసం ఉండేది. ఒకసారి శివుడు బిల్వపత్రం కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. పార్వతి దేవీ శివుని పూజకు కావలసిన సామగ్రిని తీసుకురావడం మరచిపోయింది. ఈ క్రమంలో పార్వతీ దేవీ బిల్వపత్రాలతోనే శివుడిని పూజించింది.
పార్వతి చేసిన పూజకు భోలేనాథ్‌డు చాలా సంతోషించాడు. అప్పటి నుంచి భోలే శంకర్‌కు బిల్వపత్రాన్ని సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది. ఆరాధన సమయంలో శివునికి బిల్వపత్రాన్ని సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తలు నమ్ముతారు. భార్యాభర్తలు శివునికి బిల్వపత్రం సమర్పిస్తే వారి దాంపత్య జీవితం ఆనందమయం, పిల్లలు సుఖసంతోషాలు పొందుతారని చెబుతుంటారు.
11 లేదా 21 బిల్వపత్రాలు..
మహాశివరాత్రి రోజున శివునికి 11 లేదా 21 బిల్వపత్రాలు సమర్పించడం సంప్రదాయం. కానీ, ఏ ఆకు కూడా పాడవకుండా జాగ్రత్తపడాలి. ఆ తరువాత వాటిని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసి, ఆపై వాటిని గంగాజలంతో శుద్ధి చేయాలి. ఈ బిల్వపత్రాలన్నింటిపై చందనంతో ఓం అని రాయాలి. ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శివలింగానికి సమర్పిస్తే మంచిదని చెబుతుంటారు.
శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించేటప్పుడు ఈ కింది మంత్రాలను జపించాలి:
త్రిదల, త్రిగుణాకర, త్రినేత్ర, త్రిధాయుధం.
త్రిజన్మపాపసంహార బిల్వపత్రం శివార్పణం ||
బిల్వ పత్రాన్ని చూడటం, తాకితే పాపాలు నశిస్తాయి. పాపాలను పోగొట్టడానికి బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..