Srisailam: రేపటి నుంచి శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భక్తుల సౌకర్యార్ధం..ఆన్ లైన్‌లో టికెట్లు..
Srisailam: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం శివరాత్రి(Shivaratri)కి ముస్తాబవుతోంది. రేపటి నుంచి భ్రమరాంబామల్లికార్జున స్వామి మహా శివరాత్రి..
Srisailam: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం శివరాత్రి(Shivaratri)కి ముస్తాబవుతోంది. రేపటి నుంచి భ్రమరాంబామల్లికార్జున స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకూ 11 రోజుల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రికి, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులు దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికారులు ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఈవో లవన్న సూచించారు. ఆన్ లైన్ లో రూ. 200 శీఘ్రదర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. శీఘ్ర దర్శనం టికెట్లు రోజులు ఐదు వేలు అందుబాటులో ఉండగా.. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రెండు వేలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రేపు (ఫిబ్రవరి 21వ తేదీ) 9 గంటలకు అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 23 నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కరోనా నిబంధనలను పాటిస్తూ.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read: