Astro Tips: ఇంటిలో అదనపు వస్తువులను మంచం కింద పెట్టేస్తున్నారా.. అయితే మీకు ఈ ఇబ్బందులు తప్పవట..
Astro Tips: ఇంటిని నిర్మించుకోవడానికి, ఆ ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి వాస్తు శాస్త్రం(Vastu Shastra)లో కొన్ని నియమాలు ఉన్నాయని, అవి పాటించకపోతే..
Astro Tips: ఇంటిని నిర్మించుకోవడానికి, ఆ ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి వాస్తు శాస్త్రం(Vastu Shastra)లో కొన్ని నియమాలు ఉన్నాయని, అవి పాటించకపోతే జీవితంలో వాస్తు దోషం పడుతుందని అంటారు. చాలా మంది వ్యక్తులు ఇంట్లో ఉన్న అదనపు వస్తువులను.. ఎవరికీ కనిపించకుండా.. కొన్ని చోట్ల పెడతారు. ఎక్కువమంది ప్లేస్ కలిసి వస్తుందని అదనపు వస్తువులను తాము పడుకునే మంచం లోపల లేదా కింద ఉంచుతారు. అలా చేయడం వాస్తు ప్రకారం నష్టం కలిగిస్తుంది. మంచం లోపల లేదా కింద వస్తువులను పెట్టడం మంచిది కాదు. వాస్తు దోషం కారణంగా.. ఆ ఇంటి యజమాని ఆర్థిక, శారీరక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది . అంతేకాదు వాస్తుకు సంబంధించిన నియమాలను విస్మరించడం వల్ల.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకనే మంచానికి సంబంధించి వాస్తులో కూడా కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఈ విషయాలు, నియమాల గురించి ఈరోజు తెలుసుకుందాం..
ఎలక్ట్రిక్ వస్తువులు: ఇంట్లో ఉపయోగించని ఎలక్ట్రికల్ వస్తువులను బెడ్ కింద లేదా లోపల ఉంచకూడదు. ఇలా చేయడంవలన.. ఇంటి యజమాని ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అంతే కాదు నిద్రలేమి సమస్య కూడా ఏర్పడవచ్చునని అంటున్నారు. కనుక ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులను స్టోర్ గదిలో మాత్రమే పెట్టడానికి ప్రయత్నించండి.
చీపురు: చాలా మంది ఇంటిని లేదా గదిని శుభ్రం చేసిన వెంటనే.. ఆ చీపురును నిద్రించే మంచం క్రింద ఉంచుతారు. ఇలా చేయడం వాస్తు శాస్త్రం ప్రకారం దోషం. చీపురు లక్ష్మీదేవికి సంబంధించినదని, సంపదకు దేవత అని, చీపురును మంచం కింద ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం. మంచం కింద చీపురు పెట్టడం వలన డబ్బులకు ఇబ్బందులు ఎదుర్కోవడం, నష్టం కలగడం వంటివి జరగవచ్చు.
ఇనుప వస్తువులు: కొంతమంది ఇంట్లో ఖాళీ ఏర్పడుతుందని.. ఇనుప వస్తువులను మంచం కింద లేదా లోపల ఉంచుతారు. ఇలా చేయడం వాస్తు ప్రకారం అశుభం అని అంటారు. అవసరం లేని ఇనుము వస్తువులు విక్రయించడం మంచిది. ఒకవేళ ఆ ఇనుప వస్తువులు మళ్ళీ ఉపయోగించేవి అయితే.. స్టో రూమ్ లో భద్రపరచండి.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Read Also: