Maha Shivaratri: శివాలయంలో నాగుపాము దర్శనం .. ప్రతి ఏటా శివరాత్రి జాగరణ సమయంలో ప్రత్యక్షం అవుతున్న నాగేంద్రుడు..

శివయ్య భక్తులే కాదు నేను కూడా అంటూ మహా శివరాత్రి పర్వదినం రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం అయింది. భోలాశంకరుడిని, నాగు పాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనం ఇచ్చింది.

Maha Shivaratri: శివాలయంలో నాగుపాము దర్శనం .. ప్రతి ఏటా శివరాత్రి జాగరణ సమయంలో ప్రత్యక్షం అవుతున్న నాగేంద్రుడు..
Snake In Temple
Follow us

|

Updated on: Mar 09, 2024 | 7:22 AM

మహా శివరాత్రి పండగను హిందువులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. శివాలయాలు శివ నామస్మరణ తో మారుమ్రోగాయి. శివయ్య భక్తులే కాదు నేను కూడా అంటూ మహా శివరాత్రి పర్వదినం రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం అయింది. భోలాశంకరుడిని, నాగు పాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.

నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనం ఇచ్చింది. మహాశివరాత్రి రోజు నాగుపాము దర్శనం ఇవ్వడంతో మహా భాగ్యమని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది శివరాత్రి‌ రోజున నాగుపాము  దర్శనం ఇస్తోంది. ప్రతి‌ ఏడాది శివరాత్రి అర్థరాత్రి వేళ జాగరణ సమయంలో ఆలయం గర్బగుడిలో  నాగుపాము దర్శనం ఇస్తోంది. ఆలయంలో శివుడిని దర్శించుకుని అనంతరం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles