Astro News: మీ పిల్లలు ఎంత చదివినా పరీక్షల్లో మరిచిపోతున్నారా.. జ్యోతిష్యం ప్రకారం మెమరీ పవర్ కోసం ఇలా చేయండి..?
Astro News: కొంతమంది పిల్లలు ఇంట్లో ఎప్పుడూ చదువుతూనే ఉంటారు కానీ పరీక్షలు వచ్చేసరికి మొత్తం మరిచిపోతారు.
Astro News: కొంతమంది పిల్లలు ఇంట్లో ఎప్పుడూ చదువుతూనే ఉంటారు కానీ పరీక్షలు వచ్చేసరికి మొత్తం మరిచిపోతారు. దీనికి కారణం జ్ఞాపకశక్తి సరిగ్గా లేకపోవడమే. జ్ఞాపకశక్తి తక్కువగా ఉండి, ఏకాగ్రత కుదరడం లేదని అనిపిస్తే జ్యోతిష్యం ప్రకారం కొన్ని పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
1. మీ పిల్లల జ్ఞాపకశక్తి తక్కువగా ఉందని మీరు భావిస్తే పెంచడానికి ప్రతిరోజూ గణపతిని పూజించేలా ప్రేరేపించండి. బుధవారం ప్రత్యేకంగా పూజ చేయించండి. అదే సమయంలో ప్రతి బుధవారం ఆవుకు పచ్చి గడ్డి తినిపించండి. చెట్లకు, మొక్కలకు నీరు అందించండి.
2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైనా జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటే బుధవారం సరస్వతీ యంత్రాన్ని పూజించి, అభిషేకం చేసిన తర్వాత ధరించాలి.
3. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటే మీరు చదువులో విజయం సాధించకపోతే చదువుతున్నప్పుడు మీ ముందు అద్దం పెట్టుకుని చదవండి. పరీక్ష రోజున పేపర్ ప్రారంభించే ముందు తర్వాత మీ నోటిలో కొన్ని తులసి ఆకులను వేసుకోండి.
4. సనాతన హిందూ సంప్రదాయంలో శ్రీ హనుమాన్ శక్తి, బుద్ధి, అభ్యాసం మహాసముద్రంగా పరిగణిస్తారు. మీ జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటే మీరు హనుమంతుడిని పూజించాలి. ప్రతిరోజూ ఏడుసార్లు హనుమాన్ చాలీసా చదవాలి. హనుమాన్ నుంచి జ్ఞానం, ఆశీర్వాదం పొందడానికి, మంగళవారం ఏదైనా హనుమాన్ ఆలయానికి రామాయణాన్ని విరాళంగా ఇవ్వాలి.
5. సనాతన సంప్రదాయంలో మంత్రాలను పఠించడం జీవితానికి సంబంధించిన అన్ని ఇబ్బందులను తొలగించడానికి, కోరికలను నెరవేర్చడానికి చాలా ప్రభావవంతమైన మార్గంగా చెప్పారు. జ్ఞాపకశక్తి కోసం మీరు పూర్తి భక్తి శ్రద్దలతో సరస్వతి మాతా మంత్రాన్ని జపించాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠాకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.