Fitness Tips: యోగా చేయడానికి ముందు తర్వాత ఏం తినాలో తెలుసుకోండి..?

Fitness Tips: యోగా చేయడం వల్ల శారీరక సమస్యలు తొలగిపోయి అంతర్గత ఆనందం దొరుకుతుంది. అలాగే యోగాకు సంబంధించిన ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. యోగా చేసే ముందు, తర్వాత ఏం తినాలో తెలుసుకుందాం.

uppula Raju

|

Updated on: Feb 01, 2022 | 4:08 PM

అల్పాహారం తేలికగా ఉండాలి: యోగా చేయడానికి రెండున్నర గంటల ముందు అల్పాహారం   తీసుకోవాలి. అది తేలికగా ఉండాలి. మీకు కావాలంటే పోహా లేదా ఓట్స్ తినవచ్చు.

1 / 5
ఎక్కువ నీరు తాగండి: యోగాలో మీ శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండాలి. ఎందుకంటే   వ్యాయామం చేసే సమయంలో చెమటలు పట్టడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. శరీరానికి   తగినంత నీరు అవసరం.

2 / 5
అరటిపండు: కావాలంటే యోగాకు ముందు అరటిపండు తినవచ్చు. అరటిపండులో పీచు   పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచుతుంది. అంతే కాదు అరటిపండు   తింటే శరీరానికి శక్తి కూడా వస్తుంది.

3 / 5
రెండు గంటల ముందు భోజనం చేయవద్దు: మీరు యోగా సమయంలో బరువుగా   ఉండకూడదనుకుంటే రెండు గంటల ముందు ఏమీ తినకుండా ఉండాలి. మీరు తిన్న కొద్దిసేపటికే   యోగా చేస్తే అది ఉదర సమస్యలకి కారణమవుతుంది.

4 / 5
తర్వాత ఏం తినాలి: యోగా చేసిన 30 నుంచి 40 నిమిషాల తర్వాత ముందుగా నీళ్లు తాగాలి.   తరువాత పాలు, తృణధాన్యాలు తీసుకుంటే మంచిది.

5 / 5
Follow us