Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: ఈ అలవాట్లు మీ కుటుంబంలో గొడవలు, బాధలకు కారణం అవుతాయి.. దరిద్రం వేధిస్తుంది..

గరుడ పురాణం హిందూ మతంలో ముఖ్యమైన గ్రంథం. 8 మహాపురాణాలలో ఒకటి. హిందూ మతంలో ఈ పురాణానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ గొప్ప గ్రంథాన్ని శ్రీ మహావిష్ణువు చెబుతుండగా.. మహర్షి వేద వ్యాసుడ రచించారని అంటుంటారు. గరుడ పురాణం ఒక సాధారణ పుస్తకం కాదు. ఎన్నో ప్రత్యేకమైన రహస్యాలతో నిండి ఉంది. ఇది మరణం తర్వాత జరిగే సంఘటనల గురించి చెబుతుంది. అలాగే, గరుడ పురాణంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను..

Garuda Puranam: ఈ అలవాట్లు మీ కుటుంబంలో గొడవలు, బాధలకు కారణం అవుతాయి.. దరిద్రం వేధిస్తుంది..
Garuda Puranam
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 16, 2023 | 6:20 AM

Garuda Puranam: గరుడ పురాణం హిందూ మతంలో ముఖ్యమైన గ్రంథం. 8 మహాపురాణాలలో ఒకటి. హిందూ మతంలో ఈ పురాణానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ గొప్ప గ్రంథాన్ని శ్రీ మహావిష్ణువు చెబుతుండగా.. మహర్షి వేద వ్యాసుడ రచించారని అంటుంటారు. గరుడ పురాణం ఒక సాధారణ పుస్తకం కాదు. ఎన్నో ప్రత్యేకమైన రహస్యాలతో నిండి ఉంది. ఇది మరణం తర్వాత జరిగే సంఘటనల గురించి చెబుతుంది. అలాగే, గరుడ పురాణంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను శ్రీ మహా విష్ణువు వివరించారు. వాటిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి సమస్యల నుండి విముక్తి పొంది సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు.

మతపరమైన కార్యకలాపాలకు సంబంధించి అనేక విధానాలు, నియమాలు గరుడ పురాణంలో కూడా పేర్కొనడం జరిగింది. ఇందులో దైనందిన జీవితానికి సంబంధించిన అలవాట్లను సకాలంలో సరిదిద్దుకోకుంటే ఇంట్లో కలహాలకు దారితీస్తుందని చెప్పడం జరిగింది. అలాగే, ఈ అలవాట్లతో దురదృష్ణ దేవత ఇంట్లో నివసించడం ప్రారంభిస్తుంది. దురదృష్ట దేవత కొలువై ఉండే ఇంట్లో దారిద్ర్య ఉంటుంది. లక్ష్మీదేవి లేని ఇంట్లో పేదరికం పెరిగిపోతుంది. అందువల్ల.. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సును మెరుగుపరచడానికి ఏ అలవాట్లు ముఖ్యమో తెలుసుకోండి.

కొందరికి పనికిరాని వ్యర్థ పదార్థాలను ఇంట్లో నుంచి బయట పారేయడం ఇష్టంలేక వాటిని సేకరించే అలవాటు ఉంటుంది. కానీ ఇంట్లో చెత్త నిల్వ చేసే వారు పేదరికాన్ని ఆహ్వానిస్తారు. ఎక్కడ వ్యర్థాలు పేరుకుపోతే, అక్కడ ప్రతికూలత వేగంగా వ్యాపిస్తుంది. అలాంటి ఇంట్లో ఆనందం, శాంతి హరిస్తుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీ వల్ల కుటుంబ సభ్యుల మధ్య చాలా గొడవలు జరుగుతుంటాయి. స్నేహపూర్వకంగా మారడానికి బదులుగా, పరస్పర సంబంధాలు వివాదాస్పదంగా మారతాయి. అందుకే, ఇంట్లో పడి ఉన్న పనికిరాని, జంక్ వస్తువులను వీలైనంత వరకు పడేసే ప్రయత్నం చేయాలి.

ఇంటి మొత్తంలో వంటగది ఎంతో కీలకమైంది. ఇది దేవాలయం వలె శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎందుకంటే తల్లి అన్నపూర్ణ ఇక్కడ నివసిస్తుంది. కానీ చాలామంది వంటగదిని ఎప్పుడూ మురికిగా ఉంచుతారు. రాత్రి పూట ఖాళీ పాత్రలను కూడా సింక్‌లో వదిలేస్తున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత తరచుగా మురికి పాత్రలను సింక్‌లో ఉంచుతారు. కానీ, ఎప్పుడూ అలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. అందుకే రాత్రి పూట పాత్రలు, వంటగది శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి.

మాతా లక్ష్మి పరిశుభ్రతను ఇష్టపడుతుంది. శుభ్రతపై ఎక్కడ శ్రద్ధ తీసుకుంటారో.. అక్కడ మాతా లక్ష్మి నివసిస్తుంది. దీనికి విరుద్ధంగా.. ఎక్కడ ధూళి ఉంటుందో అక్కడ దురదృష్టం వచ్చి చేరుతుంది. అలాగే, రోజూ క్లీనింగ్ చేయని ఇళ్లలో నెగెటివ్ ఎనర్జీ వేగంగా పెరిగి ఇంటి ఆనందానికి, శాంతికి భంగం కలిగిస్తుంది. అందువల్ల, గరుడ పురాణంలో ఇంటిని శుభ్రంగా, చక్కగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని, మత గ్రంధాల్లోని సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..