AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూశారా.. దోషం నివారణ కోసం ఈ శ్లోకాన్ని పఠించండి..

వినాయక చవితి  రాత్రి చంద్రుడిని చూస్తే భవిష్యత్తులో అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో వినాయక చవితి రోజున ఈ దోషాన్ని నివారించడానికి.. చంద్రుడిని చూడకుండా ఉండాల్సి ఉంటుంది. 

Vinayaka Chavithi: చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూశారా.. దోషం నివారణ కోసం ఈ శ్లోకాన్ని పఠించండి..
Vinayaka Chavithi
Surya Kala
|

Updated on: Aug 30, 2022 | 12:25 PM

Share

Vinayaka Chavithi: ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగను భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తేదీన జరుపుకుంటారు. బుద్ధి-సిద్ధిని ఇచ్చే గణేశుడి జన్మకు సంబంధించిన ఈ పవిత్ర తేదీ ఈ సంవత్సరం 31 ఆగస్టు 2022న వచ్చింది. 10 రోజులు ఈ పర్వదినాన్ని జారుకోనున్నారు. గణేష్ చతుర్థి నాడు గణపతిని పూజించేటప్పుడు కొన్ని నియమాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. లేకపోతే శుభ ఫలితాలకు బదులు అశుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడటం అశుభం అని భావిస్తారు. అయితే వినాయక చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే..  దోషం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం.

హిందూ మతంలో భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి నాడు గణేష చతుర్థిని కళంక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వినాయక చవితి  రాత్రి చంద్రుడిని చూస్తే భవిష్యత్తులో అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో వినాయక చవితి రోజున ఈ దోషాన్ని నివారించడానికి.. చంద్రుడిని చూడకుండా ఉండాల్సి ఉంటుంది.

గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూసినప్పుడు, ఒక వ్యక్తి భవిష్యత్తులో రకరకాల అపవాదులను పొందే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన  పురాణంలో ఒక కథ వివరించబడింది. గణేశుడు తన తండ్రి శివుడు , తల్లి పార్వతికి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆదిపూజ్యుడిగా నియమింపబడ్డాడు. ముక్కోటి దేవతలు గణేశుడి ఆరాధించి పూజించారు. అయితే చంద్రదేవుడు తన రూపం, అందాన్ని తలచుకుంటూ.. గర్వంగా  భావించి అవినాయకుడికి పూజలు చేయలేదు. దీంతో ఆగ్రహించిన గణేశుడు చంద్రుడిని నల్లగా ఉండమని శపించాడు. వెంటనే తన తప్పును గ్రహించిన చంద్రుడు గణపతిని వేడుకున్నాడు. దీంతో చంద్రుడిని క్షమించి గణపతి.. తాను ఇచ్చిన శాపానికి ముక్తి మార్గం చెప్పాడు. అప్పుడు గణపతి సూర్యభగవానుని కాంతి చంద్రుడిపై పడగానే తిరిగి భాయమానమైన రూపం తిరిగి వస్తుందని చెప్పాడు. ఈ సంఘటన వినాయక చవితి రోజున జరిగినందున..  ఈ రోజు చంద్ర దర్శనం చేరుకోరాదని నియమం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

చంద్ర దోషం తొలగించే పరిహారం.. వినాయక చవితి రోజున అనుకోకుండా చంద్రుడు కనిపిస్తే నిందలు పడాల్సి వస్తుందా అని కంగారు పడతారు. అయితే అస్సలు కంగారు పడకండి. ఈ దోషం తొలగిపోవాలంటే ముందుగా గణపతిని పూజించి, పూలు, పండ్లు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవాడికి దానం ఇవ్వాలి. అదే సమయంలో, భవిష్యత్తులో అపవాదులు రాకుండా ఉండటానికి, పూర్తి భక్తి , విశ్వాసంతో క్రింద ఇవ్వబడిన మంత్రాన్ని పఠించండి.

సింహం ప్రసేనుని చంపగా, సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణి కోసం ఓ సున్నిత మనస్కుడా ఏడవకు 

सिंह: प्रसेन मण्वधीत्सिंहो जाम्बवता हत:। सुकुमार मा रोदीस्तव ह्येष: स्यमन्तक:।।

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)