Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepam: దీపాలు వెలిగించేప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? నష్టపోతారు..

ఇంట్లో ఆనందం, శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని పండితులు సైతం చెబుతుంటారు. అయితే దీపాలు వెలిగించడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, సరైన పద్ధతిలో వెలిగించకపోతే నష్టాలు కూడా ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మంచి కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని...

Deepam: దీపాలు వెలిగించేప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? నష్టపోతారు..
Deepam
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2023 | 9:49 AM

సనాతన ధర్మంలో దీపాలకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీపారాధనకు హిందూ మతంలో ప్రాధాన్యత ఉంది. తులసి కోట దగ్గర, పూజగదిలో నిత్యం దీపాలు వెలిగించడం సంప్రదాయంగా వస్తుంది. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెంచడంలో దీపాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ఇంట్లో ఆనందం, శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని పండితులు సైతం చెబుతుంటారు. అయితే దీపాలు వెలిగించడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, సరైన పద్ధతిలో వెలిగించకపోతే నష్టాలు కూడా ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మంచి కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. ఇంతకీ దీపం వెలిగించే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలంటే..

* పూజ గదిలో ఎల్లప్పుడూ మంచి దీపాన్నే వెలిగించాలి. విరిగిన దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అలాగే మురికిగా ఉన్న దీపాలను వాడరాదు. దీపాలను శుభ్రంగా కడగిన తర్వాతే దీపాలను వెలిగించాలి. ఇలాంటి వాటిలో దీపాలను వెలిగిస్తే.. ప్రతికూలత పెరుగుతుంది.

* నెయ్యితో వెలిగించే దీపానికి దూది వత్తిని ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదే నూనె దీపానికి మాత్రం ఎర్రటి దారం లేదా కాటన్‌ వత్తిని ఉపయోగించాలని పండితులు సూచిస్తున్నారు.

* ఇక చాలా మంది పూజ గదిలో కేవలం ఉదయం మాత్రమే దీపాన్ని వెలిగిస్తుంటారు. అయితే సాయంత్రం కూడా దీపం వెలిగించడం మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా ఒక దీపాన్ని వెలిగించాలి.

* ఇక నెయ్యితో వెలిగించే దీపాన్ని దేవుడికి మీ ఎడమ చేతి వైపు ఉంచాలి, అలాగే నూనె దీపాన్ని మీ కుడి చేతి వైపు ఉంచాలని పండితులు చెబుతున్నారు.

* మనలో చాలా మంది ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత అదే దీపంతో మరో దీపాన్ని వెలిగిస్తుంటారు. అయితే ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే వ్యక్తి అప్పుల బారిన పడతాడని చెబుతున్నారు.

* ప్రతీ రోజూ సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత లభించడంతో పాటు, డబ్బు కొరత, ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌