Dog in Dreams: కలలో ఏ రంగు కుక్క కనిపిస్తే ఏ విధమైన సంకేతమో తెలుసా..
స్వప్న శాస్త్రంలో ప్రతి కలలో ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. కలలు గతం, భవిష్యత్తు గురించి సూచనలను ఇస్తాయి. చాలా సార్లు, నిద్రపోయే ముందు మనం ఏమనుకుంటున్నామో అది మన మనస్సులో ఉంటుంది.. ఎక్కువగా ఆ విషయానికి సంబధించిన వాటి గురించి మాత్రమే కలలు కంటాము. కొందరికి కలలో జంతువులు, పక్షులు కూడా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఎవరైనా తమ కలలో కుక్కను చూసినట్లయితే.. అది మంచి కలా లేదా చెడు కలా అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఈ రోజు తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరికి కలలు వస్తాయి. ఆ కలలలో కనిపించే విషయాలు కొన్ని సార్లు గుర్తుండిపోయేవిగా ఉంటాయి. అదే సమయంలో కొన్ని కలలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి వ్యక్తి భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయి. కొన్నిసార్లు ఈ కలలు మనకు శుభ సంకేతాలను.. కొన్నిసార్లు అశుభ సంకేతాలను ముందుగా మనకు తెలియజేస్తాయని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది. అవును స్వప్న శాస్త్రంలో ప్రతి కలలో ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. కలలు గతం, భవిష్యత్తు గురించి సూచనలను ఇస్తాయి. చాలా సార్లు, నిద్రపోయే ముందు మనం ఏమనుకుంటున్నామో అది మన మనస్సులో ఉంటుంది.. ఎక్కువగా ఆ విషయానికి సంబధించిన వాటి గురించి మాత్రమే కలలు కంటాము. కొందరికి కలలో జంతువులు, పక్షులు కూడా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఎవరైనా తమ కలలో కుక్కను చూసినట్లయితే.. అది మంచి కలా లేదా చెడు కలా అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఈ రోజు తెలుసుకుందాం..
ఎవరి కలలోనైనా కుక్క కనిపిస్తీ అది సానుకూలతను సూచిస్తుంది. అయితే కలలో కుక్కను ఏ స్థితిలో చూశారు… అనేది పెద్ద విషయం. భవిష్య పురాణం ప్రకారం, కలలో కుక్క కనిపించడం, కుక్క కాటు, కుక్క ఏడుపు లేదా మరేదైనా ఇతర స్థితిలో కనిపించడం వెనుక చాలా కారణాలు ఉండవచ్చు.
కలలో నల్ల కుక్క కనిపిస్తే
స్వప్న శాస్త్రం ప్రకారం నల్ల కుక్క జాతకంలో అత్యంత శక్తివంతమైన గ్రహమైన శనిశ్వరుడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. నల్ల కుక్కను భైరవుని సేవకుడిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఎవరి కలలో నైనా నల్ల కుక్క కనిపిస్తే, శనిదేవునితో పాటు, కాలభైరవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం. కలలో నల్ల కుక్కను చూస్తే త్వరలో శుభవార్తలను వినే అవకాశం ఉందని.. స్నేహితుడిని కూడా కలుస్తారని అర్ధం అట. కలలో నల్లకుక్క సంతోషంగా కనిపిస్తే అది శుభసూచకం. అయితే మీ కలలో నల్లకుక్క కోపంగా కనిపించడం అశుభ సంకేతం.
గోధుమ రంగు కుక్క
కలలో గోధుమ రంగు కుక్క కనిపిస్తే అది మీకు మేలు చేస్తుంది. కలలో గోధుమ రంగు కుక్కను చూడటం శుభ సంకేతం. మీ కలలో గోధుమ రంగు కుక్కను చూడటం అంటే మీ సంబంధం మరింత బలపడుతుందని అర్ధం. ఎవరితోనైనా స్నేహం చేస్తే, ఆ స్నేహంపై నమ్మకం పెరుగుతుంది.
విద్యార్థి కలలో గోధుమ రంగు కుక్క
అలాగే విద్యార్థి కలలో గోధుమ రంగు కుక్క కనిపిస్తే వారు చదువులో విజయం సాధిస్తారని.. చదువులో చాలా వేగంగా మారతారని అర్థం. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఆనారోగ్యంతో ఉన్న వ్యక్తి తన కలలో గోధుమ రంగు కుక్కను చూస్తే అతని ఆరోగ్యం త్వరలో మెరుగుపడుతుందని అర్థమట.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు