Hyderabad Metro: మెట్రో ఆదాయానికి గండికొడుతున్న మహాలక్ష్మి స్కీం.. నష్టాలను భర్తీ చేసే పనిలో అధికారులు

సంవత్సరం మూడో త్రైమాసికంలో సగటున మెట్రో రైలులో ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య రోజుకు 3.94 లక్షల మంది నుండి ఆర్థిక సంవత్సరం 24 మూడవ త్రైమాసికంలో రోజుకు 4.44 లక్షల మంది ప్రయాణీకులకు చేరుకుంది. దీంతో మొత్తంగా రోజువారీ ప్రయాణీకుల సంఖ్య మెరుగుపడినప్పటికీ.. ప్రస్తుత సంవత్సరంలో క్రితం త్రైమాసికంలో సగటు ప్రయాణీకుల సంఖ్య 4.62 లక్షలుగా ఉందని రామకృష్ణన్ వెల్లడించారు.

Hyderabad Metro: మెట్రో ఆదాయానికి గండికొడుతున్న మహాలక్ష్మి స్కీం.. నష్టాలను భర్తీ చేసే పనిలో అధికారులు
Hyderabad Metro Train
Follow us
Surya Kala

|

Updated on: Feb 01, 2024 | 11:25 AM

కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా  తెలంగాణలో మహిళకు రాష్ట్ర ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని అమలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్  ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథక ప్రభావం హైదరాబాద్ మెట్రోపై తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం, తొమ్మిది నెలల ఆర్థిక ఫలితాల్లో హైదరాబాద్ మెట్రో రైడర్‌షిప్‌పై మహాలక్ష్మి పథకం స్పష్టమైన ప్రభావాన్ని చూపిందని లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ హెడ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ పి. రామకృష్ణన్ తెలిపారు.

రోజుకు ఎంత మంది ప్రయాణీకులంటే

అంతకుముందు సంవత్సరం మూడో త్రైమాసికంలో సగటున మెట్రో రైలులో ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య రోజుకు 3.94 లక్షల మంది నుండి ఆర్థిక సంవత్సరం 24 మూడవ త్రైమాసికంలో రోజుకు 4.44 లక్షల మంది ప్రయాణీకులకు చేరుకుంది. దీంతో మొత్తంగా రోజువారీ ప్రయాణీకుల సంఖ్య మెరుగుపడినప్పటికీ.. ప్రస్తుత సంవత్సరంలో క్రితం త్రైమాసికంలో సగటు ప్రయాణీకుల సంఖ్య 4.62 లక్షలుగా ఉందని రామకృష్ణన్ వెల్లడించారు.

అయితే మూడో త్రైమాసికంలో ప్రయాణీకుల సంఖ్య తగ్గుదలకు ప్రధాన కారణం దసరాకు పొడిగించిన సెలవులు, డిసెంబరు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే మహాలక్ష్మి స్కీమ్‌ను ప్రారంభించడం అని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

రామకృష్ణన్ ఇంకా మాట్లాడుతూ, “హైదరాబాద్ మెట్రో మూడవ త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి 150 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందిందని వెల్లడించారు. డిసెంబర్ 2023 వరకు మెట్రో ప్రభుత్వం నుంచి అందుకున్న మొత్తం రూ. 900 కోట్లని వెల్లడించారు.

అయితే ప్రస్తుతం ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్  తమ హక్కుల ఇష్యూ కింద అందించే ఈక్విటీ షేర్లకు సబ్‌స్క్రయిబ్ చేయడం ద్వారా రూ. 2,774 కోట్ల వరకు ప్రతిపాదిత పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఆగస్టు 24, 2010న ఏర్పాటైన ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 703.20 కోట్లు, 2021-22కి రూ. 475.37 కోట్ల మొత్తం ఆదాయాన్ని పొందిందని ఆర్థిక నివేదిక సూచించింది. 2020-21కి రూ. 386.02 కోట్ల ఆదాయాన్ని పొందింది.

ప్రతిపాదిత రూ. 2,774 కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూషన్ L&T మెట్రో రైల్ హైదరాబాద్ అప్పు, వడ్డీ భారాన్ని తగ్గించడం, అనుబంధ సంస్థకు ఆర్థిక ఉపశమనం కలిగించడం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.

కేబీఆర్‌ పార్కులో వాకింగ్ కి వెళ్లే వారికి

మరోవైపు కేబీఆర్‌ పార్కులో వాకింగ్ కి వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల కోసం ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఓ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది.  ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 8 నుంచి 11.59  గంటల మధ్య మెట్రోలో ప్రయాణం చేసే ప్రయాణీకులకు నెబులా స్మార్ట్‌ కార్డుపై 10 శాతాన్ని తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ నగరంలో ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా వర్తిస్తుందని.. వారు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు మెట్రో లో ప్రయాణించి చేరుకోవచ్చునని మెట్రో అధికారులు చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే