AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal Politics: సిట్టింగ్ ఎంపీకి టిక్కెట్ దక్కేనా.. సెంటిమెంట్ జిల్లాలో గులాబీ బాస్ చూపు ఎవరి వైపు..!

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ప్రధానంగా ఎస్సీ - ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన వరంగల్ లోక్ సభ స్థానంపై ఫోకస్ పెంచాయి.

Warangal Politics: సిట్టింగ్ ఎంపీకి టిక్కెట్ దక్కేనా.. సెంటిమెంట్ జిల్లాలో గులాబీ బాస్ చూపు ఎవరి వైపు..!
BRS Party
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 01, 2024 | 9:24 AM

Share

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ప్రధానంగా ఎస్సీ – ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన వరంగల్ లోక్ సభ స్థానంపై ఫోకస్ పెంచాయి.

కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఓరుగల్లు ను తిరిగి కైవసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే ఉక్కు సంకల్పంతో ఉంది… ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ గెలుపు వ్యూహాలపై నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం వరంగల్ ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించాలంటే ఈసారి ఎలాగైనా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థి ని బరిలోకి దింపే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు కమలనాథులు.

అయితే ఇప్పటికే రెండు పర్యాయాలు వరుసగా గెలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టింది. బలమైన అభ్యర్థి ఎంపికపై మేథోమధనం చేస్తోంది. గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ గాలిలో అలవోకగా తెలిసిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఈసారి విశ్రాంతి తప్పదని ప్రచారం జరుగుతుంది. మరీ ఆయన స్థానంలో ఎవరిని బరిలోకి దింపుతారు..? ఎవరికీ ఈ సీట్ కట్టబెట్టబోతున్నారు అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోంది.

ప్రస్తుతం ఐదుగురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.. వారిలో ముఖ్యంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి స్వప్న, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి JAC నాయకుడు జోరిక రమేష్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజర్ కల్పన పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే, వీరిలో ఎవరిని నిలబెట్టినా ఎన్నికల ఖర్చు పార్టీ అధిష్టానమే భరించాల్సి వస్తుండడంతో వీరిలో బలమైన అభ్యర్థి ఎవరు.? ఎవరి వైపు ఓరుగల్లు ప్రజలు ఉన్నారు అనే దానిపైన సర్వేలు కొనసాగుతున్నాయట. ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

మరి ఓరుగల్లు ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉంటుందో..? ఈసారి కూడా బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విక్టరీ అందిస్తారా..? లేక అధికార కాంగ్రెస్ పార్టీకి ఓరుగల్లు పార్లమెంటు సీటు కట్టబెడతారా..? లేదంటే బీజేపీని ఇక్కడ నుండి గెలిపించి కాషాయ జెండా పాటుతారో వేచి చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…