AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు.? ప్రాముఖ్యత ఏంటి.?

దసరా రోజు సాయంత్రం జమ్మీ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత పాల పిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రం ప్రజలు ఊరి చివరకు వెళ్లి పొలాల మధ్య పాలపిట్టను చూస్తుంటారు. టెక్నాలజీ ఎంత మారుతున్నా ఇప్పటికే ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నారు ప్రజలు. ఇంతకీ దసరా రోజు పాలపిట్టను ఎందుకు దర్శించుకుంటారు.? అసలు దీని వెనకాల ఉన్న పురాతన ప్రాశస్త్యం ఏంటి.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Dussehra: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు.? ప్రాముఖ్యత ఏంటి.?
Palapitta Dussehra
Narender Vaitla
|

Updated on: Oct 22, 2023 | 9:22 PM

Share

దసరా పండుగను సంబురంగా జరుపుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. విజయాలను ఇచ్చే విజయ దశమి పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయదశమి అనగానే తెలంగాణ ప్రాంతంలో జమ్మీ గుర్తుకొచ్చినట్లే, పాల పిట్ట సైతం గుర్తొస్తుంది.

దసరా రోజు సాయంత్రం జమ్మీ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత పాల పిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రం ప్రజలు ఊరి చివరకు వెళ్లి పొలాల మధ్య పాలపిట్టను చూస్తుంటారు. టెక్నాలజీ ఎంత మారుతున్నా ఇప్పటికే ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నారు ప్రజలు. ఇంతకీ దసరా రోజు పాలపిట్టను ఎందుకు దర్శించుకుంటారు.? అసలు దీని వెనకాల ఉన్న పురాతన ప్రాశస్త్యం ఏంటి.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పాలపిట్టను చూస్తే విజయం దక్కుతుందనే నమ్మకం వెనకాల పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. త్రేతా యుగంలో రావణాసురిడితో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరిన సమయంలో పాలపిట్ట కనిపిస్తుంది. ఆ రోజు విజయదశమి కావడం విశేషం. అయితే అనంతరం జరిగిన యుద్ధంలో రావణ సంహారం జరిగి, రాముడు విజయం సాధిస్తారు. దీంతో పాలపిట్టను చూడడం శుభశకునంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇక మహాభారతంలోనూ పాలపిట్ట ప్రస్తావన ఉంది. పాండవులు జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాండవులు అజ్ఞాత వాసాన్ని ముగించుకొని తిరిగి తమ రాజ్యానికి పయణమైన సమయంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందని, దీంతో పాలపిట్ట కనిపించినప్పటి నుంచి పాండవులకు అన్ని విజయాలే దక్కాయని అందుకే పాలపిట్ట విజయానికి సూచికగా భావించడం నమ్మకంగా మారింది.

పాలపిట్టకు పురాణాల్లో ఉన్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని పరిగణలోకి తీసుకునే తెలంగాణ ప్రభుత్వం పాల పిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించిన విషయం తెలిసిందే. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాలు కూడా పాలపిట్టను అధికారిక పక్షిగా గుర్తించాయి.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్ చేయండి..