AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2023: ఈసారి దీపావళికి మీ ఇంటిని ఇలా అలంకరించుకోండి.. వెలిగి పోతుంది!

దీపావళి.. ఈ పేరులోనే ఉంది వెలుగు. దీపావళి వచ్చిందంటే.. ప్రతి ఇల్లూ వెలిగిపోతూ ఉంటుంది. దీపావళి ఒక్కొక్కరు ఒక్కోలా ఇంటిని అలంకరిస్తారు. కొందరు దీపాలను వెలిగిస్తే.. మరికొందరు విద్యుత్ దీపాలతో నింపేస్తారు. దీపావళికి.. ప్రతి ఒక్కరూ షాపింగ్ చేస్తారు. మార్కెట్లో వచ్చే వివిధ రకాల డెకరేషన్ ఐటెమ్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్ర పరుచుకుని.. ఇంటికి అవసరమైన అన్ని వస్తువులను కొంటూంటారు. ఈ సారి దీపావళి 2023 నవంబర్ 12వ..

Diwali 2023: ఈసారి దీపావళికి మీ ఇంటిని ఇలా అలంకరించుకోండి.. వెలిగి పోతుంది!
ఈ సంవత్సరం దీపావళి పండుగను 12 నవంబర్ 2023 న దేశ విదేశాల్లో జరుపుకుంటారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా భావించే దీపావళి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతులు, నమ్మకాల ఆధారంగా జరుపుకుంటారు. భారతదేశంలో విదేశాల్లో దీపావళికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 23, 2023 | 2:30 PM

Share

దీపావళి.. ఈ పేరులోనే ఉంది వెలుగు. దీపావళి వచ్చిందంటే.. ప్రతి ఇల్లూ వెలిగిపోతూ ఉంటుంది. దీపావళి ఒక్కొక్కరు ఒక్కోలా ఇంటిని అలంకరిస్తారు. కొందరు దీపాలను వెలిగిస్తే.. మరికొందరు విద్యుత్ దీపాలతో నింపేస్తారు. దీపావళికి.. ప్రతి ఒక్కరూ షాపింగ్ చేస్తారు. మార్కెట్లో వచ్చే వివిధ రకాల డెకరేషన్ ఐటెమ్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్ర పరుచుకుని.. ఇంటికి అవసరమైన అన్ని వస్తువులను కొంటూంటారు. ఈ సారి దీపావళి 2023 నవంబర్ 12వ తేదీన వచ్చింది.

దీపావళికి ముఖ్యమైనది డెకరేషనే. ఈ పండుగ సమయంలో చాలా మంది తమ ఇళ్లను దీపాలతో, విద్యుత్ దీపాలతో కొత్తగా అలంకరిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇంటిని అలంకరిస్తూ ఉంటారు. ఈసారి ఇంటిని ఎలా డెకరేషన్ చేయవచ్చా అని ఆలోచిస్తున్నా.. అయితే మీ కోసం కొన్ని డెకరేషన్ ఐటెమ్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిల్లో మీకు నచ్చింది ఏంటో చూడండి. ఇలా ముందుగానే సెట్ చేసుకుంటే.. అందరి కంటే ముందుగానే మీరు డెకరేషన్ పూర్తి చేయవచ్చు.

లాంతరు దీపాలు:

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కొత్త ఫ్యాషన్ గా లాంతరు దీపాలు వచ్చాయి. వీటితో మీ ఇంటి లుక్కే మారిపోతుంది. పూర్వం ఈ లాంతరు దీపాలు ఉండేవి. వాటినే ఇప్పుడు రీ మోడల్ చేస్తూ కొత్త డిజైన్స్ తో.. మంచి ఎట్రాక్టీవ్ కలర్స్ తో ముందుకు తీసుకొచ్చారు. ఈ సారి మీ ఇంటి ముందు కలర్ ఫుల్ లాంతరు దీపాలను ఉంచండి. ఎంత చక్కగా ఉంటుందో మీరు ఊహించ లేరు. అదే విధంగా ఒక్కటే కలర్ కాకుండా డార్క్ కలర్స్ ఉన్న వాటిని తీసుకుంటే సరి కొత్తగా ఉంటుంది.

Lanterns

వాటర్ సెన్సార్ దీపాలు:

సాధారణంగా చలి కాలంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి.. ఆ సమయంలో గాలి అనేది ఎక్కువగా వీస్తుంది. ఈ సమయంలో మట్టి దీపాలు వెలిగించినా.. అవి ఆరిపోతూ ఉంటాయి. మళ్లీ వాటిని వెలిగించడం ఇదే పని సరిపోతుంది. కొన్ని వెలుగుతూ ఉంటే.. మరి కొన్ని ఆరి లుక్ అంతగా బాగోదు. అయితే ఈసారి మాత్రం వాటర్ సెన్సార్ దీపాలను తీసుకోండి. వీటిల్లో వాటర్ వేస్తే చాలు.. అవి వెలుగుతూ అందంగా కనిపిస్తాయి. ఒక గోడ అంతటా వీటిని పెడితే బలే అందంగా ఉంటాయి.

రంగోలి విత్ దీపాలు:

మీ ఇంటిని మరింత అందంగా ఎట్రాక్టీవ్ గా ఉండాలంటే రంగోలి విత్ దీపాలు ఉండాల్సిందే. అందమైన రంగోలి మీద దీపాలు పెడితే ఆహా.. సూపర్ గా ఉంటుంది. ఈ రంగోలీని పూలతో లేదా కలర్స్ తో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద.. అందమైన రంగోలి వేసి.. వాటిపై మట్టి దీపాలు ఉంచితే.. చాలా అందంగా కనిపిస్తుంది.

టోరన్స్:

ఇల్లు అలంకరణ వస్తువుల్లో టోరన్స్ కూడా ఒకటి. వీటిని ప్రధాన ద్వారం లేదా మధ్య ద్వారం, ఎంట్రన్స్ వద్ద ఉంచితే చాలా అందంగా ఉంటాయి. ప్రస్తుతం వివిధ రకాల టోరన్స్ మార్కెట్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

Follow Us
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే