AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunday: సూర్యుడికి కోపం తెప్పించే ఈ ఆహారాలు తినొద్దు!

జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని తొమ్మిది గ్రహాలలో ఒకటిగా భావిస్తారు. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడినది. చాలా మంది ఆదివారం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయడంతోపాటు ఉపవాసం ఉంటూ ఆ దేవుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషిస్తాడని నమ్ముతారు. అయితే, సూర్య భగవానుడికి కోపం కలిగించే కొన్ని ఆహార పదార్థాలను ఈ రోజు తీసుకోవద్దని చెబుతారు.

Sunday: సూర్యుడికి కోపం తెప్పించే ఈ ఆహారాలు తినొద్దు!
Sun God
Rajashekher G
|

Updated on: Jan 04, 2026 | 11:22 AM

Share

సనాతన ధర్మంలో వారంలోని ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి అంకితం చేయబడినది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని తొమ్మిది గ్రహాలలో ఒకటిగా భావిస్తారు. చాలా మంది ఆదివారం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయడంతోపాటు ఉపవాసం ఉంటూ ఆ దేవుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషిస్తాడని నమ్ముతారు.

సూర్య భగవానుడి ఆశీస్సులు జీవితంలో ఆనందానికి కారణమవుతాయి. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి.. ఆ రోజు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని పండితులు చెబతారు. ఆదివారాల్లో ఆ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సూర్య భగవానుడికి కోపం వస్తుందని విశ్వసిస్తారు.

ఆదివారంనాడు తినకూడని పదార్థాలు ఇవే

మాంసాహారం: ఆదివారాల్లో మాంసం, మద్యం తీసుకోకూడదు. ఆదివారాల్లో మాంసం, మద్యం సేవించడం వల్ల సూర్యభగవానుడికి కోపం వస్తుందని చెబుతారు. దీంతో వారి జీవితంలో అనేక సమస్యలు వస్తాయని నమ్ముతారు.

ఉల్లిపాయ: ఆదివారంనాడు ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఆదివారం మాత్రం తినకూడదని శాస్త్ర పండితులు చెబుతారు. ఈ రోజున ఉల్లిపాయలను తినకుండా ఉండాలి.

పప్పులు: కాయ ధాన్యాల్లో ప్రోటీన్లు మాంసం కంటే ఎక్కువగా ఉంటాయి. కాయధాన్యాలను ఎప్పుడూ దేవతలకు నైవేద్యంగా సమర్పించరు. అలా చేయడం శాస్త్రాలలో నిషేధించబడినది. అందుకే ఆదివారాల్లో కాయధాన్యాలు కూడా తినకూడదంటారు. ఇక, ఆదివారంనాడు వెల్లుల్లిని తినకూడదని చెబుతారు. ఎందుకంటే, మత విశ్వాసాలు దానిని అశుభంగా భావిస్తాయి.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.