AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కూష్మాండ దేవి ఆలయాలు.. పిండి అమ్మవారి నుంచి నిరంతరం నీరు ప్రవాహం.. మిస్టరీ టెంపుల్ ఎక్కడంటే..

కొన్ని ఆలయాల్లోని రహస్యాలు నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. అమ్మవారి ఆలయాలను నవరాత్రుల సమయంలో భారీగా భక్తులు దర్శించుకుంటారు. అయితే దుర్గాదేవి అవతారం అయిన కూష్మాండ దేవికి అంకితం చేయబడిన దేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ ఆలయాల్లోని  కూష్మాండ దేవి ఆశీర్వాదం దర్శనంతోనే పొందవచ్చు. కూష్మాండ దేవికి చెందిన ప్రసిద్ధ, పురాతన దేవాలయం వారణాసిలోని రామ్‌నగర్‌లో ఉంది.

దేశంలో కూష్మాండ దేవి ఆలయాలు.. పిండి అమ్మవారి నుంచి నిరంతరం నీరు ప్రవాహం.. మిస్టరీ టెంపుల్ ఎక్కడంటే..
Kushmanda Devi Temple
Surya Kala
|

Updated on: Apr 13, 2024 | 8:11 AM

Share

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ హిందూ దేవుళ్లకు, దేవతలకు అంకితం చేయబడిన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. పండుగల సమయంలో ఈ దేవాలయాలలో విభిన్నమైన శోభ కనిపిస్తుంది. చాలా ఆసక్తికరమైన పౌరాణిక కథలతో పాటు, ఈ దేవాలయాలలో కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆలయాల్లోని రహస్యాలు నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. అమ్మవారి ఆలయాలను నవరాత్రుల సమయంలో భారీగా భక్తులు దర్శించుకుంటారు. అయితే దుర్గాదేవి అవతారం అయిన కూష్మాండ దేవికి అంకితం చేయబడిన దేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ ఆలయాల్లోని  కూష్మాండ దేవి ఆశీర్వాదం దర్శనంతోనే పొందవచ్చు.

బనారస్‌లోని కూష్మాండ దేవి ఆలయం

కూష్మాండ దేవికి చెందిన ప్రసిద్ధ, పురాతన దేవాలయం వారణాసిలోని రామ్‌నగర్‌లో ఉంది. సుబాహు అనే రాజు కూష్మాండ దేవి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేసి తన రాజ్య రాజధాని వారణాసిలో అదే పేరుతో నివసించాలని దేవత నుంచి వరం కోరినట్లు ఈ ఆలయానికి సంబంధించిన పౌరాణిక నమ్మకం ఉంది. ఇది దేవీ భగవత్ పురాణంలో ప్రస్తావించబడింది. నవరాత్రి సమయంలో కూష్మాండ అమ్మవారి దర్శనం కోసం భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు.

ఇక్కడ అమ్మవారి విగ్రహం రహస్యం ఏమిటంటే

ఈ ఆలయంలో ప్రతిష్టించిన కూష్మాండ దేవి విగ్రహం ఏ వ్యక్తి చేయలేద అని నమ్ముతారు. స్వయంభువుగా వెలిసిన అమ్మవారు దుష్ట శక్తుల నుంచి ప్రజలను రక్షింస్తుందని విశ్వాసం. కనిపించింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కువ సంఖ్యలో కోతులు ఉన్నందున ఈ ఆలయాన్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

కూష్మాండ ఆలయం, ఉత్తరాఖండ్

దేవభూమి ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లోని అగస్త్యముని బ్లాక్‌లోని సిల్లా గ్రామంలో కూష్మాండ దేవిని..  ఆనంద దేవతగా పూజిస్తారు. సిల్లా గ్రామంలోనే అగస్త్య మహర్షి గర్భం నుంచి కూష్మాండ దేవి జన్మించిందని నమ్ముతారు. దుర్గా సప్తశతి నాల్గవ శ్రేణిలో తల్లి కూష్మాండ జననం గురించి వివరించబడింది. స్థానికులు ఇక్కడ ఉన్న అమ్మవారిని కుమాసైన్ అనే పేరుతో కూడా పూజిస్తారు.

ప్రాచుర్యం పొందిన అమ్మవారి అద్వితీయ కథ

హిమాలయ ప్రాంతంలో రాక్షసుల భయంతో ఋషులు తమ ఆశ్రమాల్లో పూజలు చేసే పరిస్థితి లేదని..  శనీశ్వర మహారాజ్ ఆలయంలో కూడా ఇదే పరిస్థితి ఉండేదట. అంతేకాదు ఆలయంలో పూజకు వచ్చిన బ్రాహ్మణుడిని రాక్షసులు చంపేశారట. అప్పుడు శనీశ్వర మహారాజ్ తన సోదరుడు అగస్త్య ఋషిని సహాయం కోరాడు. ఆ తర్వాత అతను సిల్లా గ్రామానికి చేరుకుని ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించాడు.  అతను కూడా రాక్షసుల హింసను చూసి భయపడ్డాడు. అప్పుడు ఆదిశక్తి జగదాంబను ధ్యానం చేసి ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి గర్భం నుంచి కూష్మాండ దేవి జన్మించింది.

కూష్మాండ ఆలయం, కాన్పూర్

కూష్మాండ దేవి పురాతన ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉంది. ఈ ఆలయంలో తల్లి కూష్మాండ పిండి రూపంలో ఉంటుంది. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాలు రెండవ నుంచి పదవ శతాబ్దానికి చెందినవిగా చెబుతారు. ఈ ఆలయాన్ని కుధ అనే గోవుల కాపరి కనిపెట్టాడని ప్రఖ్యాతి గాంచింది. అతని ఆవు ఇక్కడ పొదలో ఉన్న తల్లికి తన పాలను నైవేద్యంగా పెడుతుండగా.. ఆ గోరక్షకుడు ఆశ్చర్యపోయాడు.  అతను ఈ ప్రదేశంలో తవ్వినప్పుడు.. అతను విగ్రహాన్ని చూశాడు.అయితే ఆ విగ్రహం ముగింపు కనిపించలేదు. దీంతో గోవుల కాపరి అక్కడే పిండిని తయారు చేసి కూష్మాండ దేవిని పూజించాడట.

విగ్రహం నుంచి కారుతుండే నీరు

ఈ ఆలయంలో తల్లి కూష్మాండ దేవి పిండి రూపంలో ఉంటుంది. ఈ పిండి ప్రత్యేకత ఏమిటంటే..దాని నుండి నీరు ఎల్లప్పుడూ కారుతుంది. పిండి నుండి వచ్చే నీటిని తాగిన వ్యక్తికి రోగాల నుండి విముక్తి లభిస్తుందని,  ఎటు వంటి వ్యాధి దరిచేరదని జీవితంలో ఇబ్బంది పడరని నమ్మకం. నవరాత్రి సమయంలో కూష్మాండదేవి  దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు