Keesaragutta: కీసరగుట్టగా మారిన కేసరగిరి.. ఆధ్యాత్మికతకు నిలయంగా.. సాంస్కృతికతకు కేంద్రంగా..

‘‘శివం కరోతి శంకరః’ అంటే శుభాలను కలిగించేవాడు శంకరుడు. తనను ఆరాధించిన వారికి తనను నమ్మిన వారికి శివుడు ఆలోచించకుండానే వరాలిస్తాడు. శివున్ని పూజించిన వారికి లేనిది అంటూ ఏమీ ఉండదు. అలాంటి గురుస్వరూపమైన శివుడు.. కీసరగుట్టపై స్వయంభువుగా వెలిశాడు...

Keesaragutta: కీసరగుట్టగా మారిన కేసరగిరి.. ఆధ్యాత్మికతకు నిలయంగా.. సాంస్కృతికతకు కేంద్రంగా..
Keesaragutta
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 18, 2023 | 7:14 AM

హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న శైవక్షేత్రాల్లో ఒకటి ఈ కీసరగుట్ట. ఒకప్పుడు ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండడంతో కేసరాలు అంటే సింహాలు గుంపులుగా తిరేగవట. అందుకే ఇది కేసరగిరి అయిందంటారు. గుట్టంతా శివలింగాలమయమే. ప్రతీ లింగమూ స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపం. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం.. పశ్చిమాభిముఖంగా ఉండడం విశేషం. ఇక్కడ స్వామికి చేసిన అభిషేకాల నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. పురాణాలకు చరిత్రగా… ఆధ్యాత్మికతకు నిలయంగా.. సాంస్కృతికతకు కేంద్రంగా పేరొందిన కీసరగుట్ట క్షేత్రం మహాశివరాత్రి వచ్చిదంటే చాలు.. భక్తులతో కోలాహలంగా మారిపోతుంది. శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీరామలింగేశ్వ స్వామి ఆలయంలో ఏటా మాఘ బహుళ త్రయోదశి మొదలు శుద్ధ విదియ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కనుల పండువగా జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల భక్తులు లక్షల్లో తరలివస్తారు.

లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరిక మేరకు శ్రీరామలింగేశ్వరస్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట. ఈ క్షేత్రంపై అనేక పురాణ గాథలు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి, హనుమంతుడితో రావణసంహారం తర్వాత వన విహారానికి వచ్చినప్పుడు ప్రకృతి రమణీయతకు పులకించిపోయి ఇక్కడే ఉండిపోయారన్నది స్థలపురాణం. రావణుని హతమార్చినందుకు హత్యాపాతక నివారణ కోసం ఇక్కడ ఓ శివలింగాన్ని రాముడు ప్రతిష్టించాలని నిర్ణయిస్తాడు. కాశీకి వెళ్లి ఒక జ్యోతిర్లింగాన్ని తేవాల్సిందిగా హనుమంతుడిని ఆజ్ఞాపిస్తాడు.

అప్పుడు హనుమంతుడు నూటొక్క శివలింగాలను తీసుకువచ్చినప్పటికీ అప్పటికే శుభగడియలు ముగిసిపోతాయి. అప్పుడు శ్రీరాముడు శివుని ప్రార్ధించి లింగరూపధారియైన ఆయన విగ్రహాన్ని మహర్షులు నిర్ణయించిన సుముహూర్తానికే ప్రతిష్టిస్తారు. ఏళ్ల చరిత్ర కలిగిన కీసరగుట్ట భక్తుల కొంగుబంగారంగా భాసిల్లుతోంది. శ్రీరాముడు రావణుని వధించిన తరువాత ఈ ప్రాంతంలో ఉన్న సమయంలో సీతమ్మ వారు ప్రశాంతత కోసం తపస్సు ఆచరించిన స్థలమే సీతమ్మ గుహ. ప్రస్తుతం ఈ గుహ మహిషాసుర మర్దిని ఆలయంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..