Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kotappakonda: ప్రభల కాంతులతో ధగధగలాడుతున్న కోటప్పకొండ.. తిరునాళ్లకు తరలివస్తున్న భక్తజనం..

ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా సమీపంలోని రాష్ట్రాల్లోనూ ఫేమస్ అయిన కోటప్పకొండలో శివరాత్రి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ..

Kotappakonda: ప్రభల కాంతులతో ధగధగలాడుతున్న కోటప్పకొండ.. తిరునాళ్లకు తరలివస్తున్న భక్తజనం..
Kotappakonda Temple
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 18, 2023 | 6:53 AM

ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా సమీపంలోని రాష్ట్రాల్లోనూ ఫేమస్ అయిన కోటప్పకొండలో శివరాత్రి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు.. ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరునాళ్ల రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు అందజేయడం విశేషం. పరమశివుడు మూడు కొండలపై జంగమదేవర రూపంలో ధ్యానంలో ఉండేవారు. కొండ సమీపంలోని కొండకావూరు గ్రామానికి చెందిన ఆనందవల్లి (గొల్లభామ) నిత్యం స్వామికి పాలను తీసుకెళ్లేది. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో కొండ ఎక్కలేనని, కిందకు రావాలని పరమశివుడిని కోరింది. ఆమె విజ్ఞప్తిని మెచ్చిన శివయ్య.. కొండ దిగుతున్న సమయంలో చివరి వరకు వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధించాడు. మధ్యలో వెనుదిరిగి చూస్తే శిల అయిపోతానని చెప్పాడు.

మహేశ్వరుడి షరతు అంగీకరించిన ఆనందవల్లి ముందు నడుస్తుంటే.. స్వామి వెనుకే బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక భారీ శబ్దాలు రావటంతో ఆనందవల్లి వెనుదిరిగి చూసింది. ఆ వెంటనే స్వామి బ్రహ్మ శిఖరంపై శిల రూపంలో మారిపోయారు. కాబట్టి.. ఈ క్షేత్రంలో ఆనందవల్లిని దర్శించుకున్న తర్వాతే స్వామి వారిని దర్శించుకుంటారు. గ్రామాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోటప్పకొండకు ప్రభలు కట్టుకుని వెళతారు. ప్రభల విషయంలో గ్రామాల మధ్య పోటీ కూడా ఉంటుంది. ఈ ప్రభలపై ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ ను చూస్తూ భక్తులు జాగారం చేస్తారు.

శివరాత్రి పర్వదినం సందర్భంగా.. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఘాట్‌రోడ్డులోని విగ్రహాలకు ఈ ఏడాది రంగులు వేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు తాగునీరు, మజ్జిగ, పిల్లలకు పాలు, బిస్కట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 2.50 లక్షల లడ్డూలు, 1.50 లక్షల అరిసె ప్రసాదాన్ని సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..