Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు షేర్స్, పెట్టుబడులు ఏ రాశివారికి లాభాలను ఇస్తుందో తెలుసా..! ఏ దేవుడిని పూజించాలంటే..!

మనం తీసుకునే నిర్ణయం మంచి రోజున అయ్యుంటే బాగుంటుంది కదూ.. మరి రాశి ఆధారంగా ఈరోజు మీరు ఏ పనులు చేపడితే మేలు జరుగుతుంది. ఏ పనులకు దూరంగా ఉంటే బాగుంటుంది వంటి ...

Horoscope Today: ఈ రోజు షేర్స్, పెట్టుబడులు ఏ రాశివారికి లాభాలను ఇస్తుందో తెలుసా..! ఏ దేవుడిని పూజించాలంటే..!
Follow us
Surya Kala

|

Updated on: Feb 24, 2021 | 7:14 AM

Horoscope Today: ప్రతి మనిషి జీవితంలోను జాతకప్రభావం ఉంటుంది. దీంతో తాము ప్రతీరోజు చేసే పనులు ఎలా జరుగుతాయి.. అసలు ఈరోజు మనకు ఎలా ఉంటుంది. అనే ఆలోచనలు కలుగుతుంటాయి. ఇక చాలా మంది ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అది వాహన కొనుగోలు అయ్యుండొచ్చు, నూతన పెట్టుబడులు అయ్యుండొచ్చు. అయితే మనం తీసుకునే నిర్ణయం మంచి రోజున అయ్యుంటే బాగుంటుంది కదూ.. మరి రాశి ఆధారంగా ఈరోజు మీరు ఏ పనులు చేపడితే మేలు జరుగుతుంది. ఏ పనులకు దూరంగా ఉంటే బాగుంటుంది వంటి వివరాలను ఈరోజు (బుధవారం) రాశి ఫలాల్లో తెలుసుకుందాం..

మేష రాశి:

ఈ రాశివారు ఈరోజు చేసే పనుల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సామజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధిస్తే మంచి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి:

వృషభ రాశి వారు ఈరోజు ఉద్యోగ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం తొందరపడి పనులు చేపట్టే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మహాగణపతి అర్చన మేలు చేస్తుంది.

మిథున రాశి:

ఈ రాశివారికి ఈరోజు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఎదురవుతాయి. చాక చక్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి. శివారాధన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈరోజు చేపట్టిన కార్యక్రమంలో పెద్దల సహకారం ఉంటుంది. షేర్లు, పెట్టుబడుల విషయంలో కూడా నిదానంలో వ్యవహరించడం మంచిది. గణపతి అర్చన నిర్వహించడం శుభఫలితాలను ఇస్తుంది.

సింహ రాశి:

ఈ రాశి వారికి ఈరోజు ధార్మిక చింతనలో పాల్గొంటారు. అవసరమైన చర్చాకార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివాష్టక స్తోత్ర పారాయణం మంచిది.

కన్య రాశి:

కన్య రాశి వారు ఈరోజు వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈరోజు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. గౌరవలాభాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరీ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

తుల రాశి:

ఈ రాశి వారు ఈరోజు ఆహార, విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈ రాశివారు అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మంచిది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికీ ఈరోజు చిన్న చిన్న అవరోధాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొన్ని రకాల సంఘపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించాలి. ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించడం ఈ రాశి వారికీ శుభఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు రాశి:

ఈ రాశి వారికి ఈరోజు దగ్గర ప్రదేశాలకు ప్రయాణాలు చేయనున్నారు. అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకుండా ఉండడం ఈ రాశివారికి శ్రేయస్కరం. పిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతుండాలి. దుర్గా సప్త శ్లోకీ పారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి:

మకర రాశి వారికి ఈరోజు తాము నిర్వహిస్తున్న వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందేందుకు అవకాశాలు కలిసివస్తుంటాయి. వాటిని ఉపయోగించుకోవాలి. రాజకీయ నాయకులను కూడా కలిసే అవకాశం ఉంది. శ్రీ రామ రక్షా స్త్రోత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి:

ఈ రాశి వారు ఈరోజు గతంలో చేపట్టి ఆగిపోయిన పనులు తిరిగి చేపట్టే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం వేళ శివాభిలాషేకం మంచి ఫలితాలను ఇస్తుంది.

మీన రాశి:

మీన రాశి వారికి ఈరోజు వ్యక్తిగత అవసరాలకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన రోజు. వీరు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం వలన ఈరోజు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. సుదర్శనస్వామివారి నామార్చన మేలు చేస్తుంది.

Also Read:

ఈరోజు నుంచి 4 రోజుల పాటు మినీ మేడారం జాతర.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం