Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ గుడిలోకి అకస్మాత్తుగా వచ్చిన ఆవు.. భక్తులు ఆశ్చర్య పోయేలా ఏంచేసిందంటే..

సాధారణంగా భక్తులు ఏదైనా ఆలయానికి వెళ్లిన సమయంలో ముందుగా ఎంతో భక్తి శ్రద్ధలతో గుడి చుట్టూరు 3, 9, 11, 108 ఇలా ఎవరికి నచ్చినన్నిసార్లు వారు ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి మూలవిరాట్ ను దర్శించి పూజలు నిర్వహించడం పరిపాటి. అయితే కొన్ని సార్లు ఆలయాల్లో జంతువులు ప్రదక్షిణలు చేసిన సంఘటనలు మనం చూసాం, విన్నాం.. అలాంటి ఒక ఘటన ఏలూరు జిల్లాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

Andhra Pradesh: ఆ గుడిలోకి అకస్మాత్తుగా వచ్చిన ఆవు.. భక్తులు ఆశ్చర్య పోయేలా ఏంచేసిందంటే..
Cow In Temple
Follow us
B Ravi Kumar

| Edited By: Surya Kala

Updated on: Mar 26, 2025 | 12:43 PM

గుడికి వెళ్తే దేవుడిని దర్శించుకునే ముందు.. ఆలయం చుట్టూ భక్తిశ్రద్దలతో ప్రదక్షిణలు చేస్తాం. ఇది సర్వసాధారణంగా పాటించే నియమం. అయితే గత కొంత కాలంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న జంతువులు, పక్షులకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. వీడియోలు చూస్తూనే ఉన్నాం.. అంతేకాదు ఒకొక్కసారి వానరం, పాము, ఎలుగుబంటి వి గర్భ గుడిలో దైవం దగ్గర పూజలు చేస్తున్నట్లు కూడా కొన్ని రకాల వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షం అవుతాయి. వీటిని చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనై ఇదంతా భగవంతుని మహత్యంగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ జంతువు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన జంతువు ఏమిటి అని వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఏలూరు జిల్లా నిడమర్రు మండల కేంద్రమైన నిడమర్రులో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఆలయానికి ప్రతిరోజు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కుబడులు సమర్పిస్తారు. అయితే ఈనెల 24వ తేదీ సోమవారం తెల్లవారుజామున ఆలయానికి ఒక ఆవు వచ్చింది. ఆవు ఆలయం ముందు నుంచి నడుస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. అలా కాసేపు ప్రదక్షిణలు చేసిన తరువాత ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి నిలబడింది. ద్వారం వద్ద నుండి స్వామి వారి మూలవిరాట్ను ఈ తీక్షణంగా చూస్తూ స్వామివారిని దర్శించుకుంది.

అలా కాసేపు స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసి అనంతరం స్వామివారిని దర్శించిన ఆ గోమాతను చూసిన భక్తులు, స్థానికులు ముందుగా ఆశ్చర్యానికి లోనయ్యారు.. ఆ తర్వాత ఇదంతా భగవంతుని మహిమ గా చెప్పుకుంటూ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఏలూరు జిల్లాలో వైరల్ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అపరిచితుడిని ముద్దుపెట్టుకుంటున్నట్టు కల కంటున్నారా అర్ధం ఏమిటంటే
అపరిచితుడిని ముద్దుపెట్టుకుంటున్నట్టు కల కంటున్నారా అర్ధం ఏమిటంటే
రన్యా రావుకు ఊహించని షాకిచ్చిన భర్త!
రన్యా రావుకు ఊహించని షాకిచ్చిన భర్త!
నిర్మాతగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన నిహారిక కొణిదెల
నిర్మాతగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన నిహారిక కొణిదెల
Viral Video: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్‌ జంట...
Viral Video: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్‌ జంట...
లావాదేవీల్లో యూపీఐ నయా రికార్డు.. మార్చిలో ఎన్ని కోట్లంటే..?
లావాదేవీల్లో యూపీఐ నయా రికార్డు.. మార్చిలో ఎన్ని కోట్లంటే..?
దోమలను తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..
దోమలను తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్‌!
విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్‌!