AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chardham Yatra 2021: పవిత్ర చార్ ధామ్ యాత్రకు దశలవారీగా అనుమతి.. యాత్ర చేయాలనుకునే వారికి ప్రభుత్వం ఏం చెబుతోంది

Chardham Yatra 2021: హిమాలయాలలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ సాగే చార్ ధామ్ యాత్ర కరోనా కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదనే విషయం తెలిసిందే.

Chardham Yatra 2021: పవిత్ర చార్ ధామ్ యాత్రకు దశలవారీగా అనుమతి.. యాత్ర చేయాలనుకునే వారికి ప్రభుత్వం ఏం చెబుతోంది
Chardham Yatra
KVD Varma
|

Updated on: Jun 21, 2021 | 7:53 PM

Share

Chardham Yatra 2021: హిమాలయాలలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ సాగే చార్ ధామ్ యాత్ర కరోనా కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదనే విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ ధామ్ యాత్రకు అనుమతి ఇచ్చింది. జూలై 1 నుంచి స్థానికులకు.. జూలై 11 నుంచి మిగిలిన రాష్ట్రాల ప్రజలకు చార్ ధామ్ యాత్రను తెరవాలని నిర్ణయించింది. నిజానికి ఈ యాత్ర మే 14న ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్ కేసులు ఎక్కువగా పెరగడంతో యాత్ర వాయిదా పడింది.

యాత్రకు అనుమతి ఇలా..

జూలై 1 నుంచి చమోలి జిల్లా ప్రజలు బద్రీనాథ్‌ను సందర్శించవచ్చు. రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాలు జూలై 1 నుండి కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రికి దర్శనానికి అనుమతి ఇస్తాయి. ఇక మిగిలిన రాష్ట్రాల ప్రజలు జూలై 11 నుంచి ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ యాత్ర చేయాలనుకునే వారు ఆర్టీపెసీఅర్ లేదా రాపిడ్ యాంటిజెన్ పరీక్షల నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావడం తప్పనిసరి. ఇది యాత్రీకులు అందరికీ వర్తిసుంది. అలాగే ఆక్కడి మైదాన ప్రాంతాల నుంచి కొండకు వివిధ కారణాలతో వెళ్ళేవారికీ ఈ పరీక్షల నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి.

ఉత్తరాఖండ్ కర్ఫ్యూను పొడిగించినప్పటికీ ఆంక్షలను సడలించింది. ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన సడలింపులతో ఉత్తరాఖండ్ కర్ఫ్యూను జూన్ 22 నుండి 29 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 22 నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ మరో వారం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్లను 50 శాతం సామర్థ్యంతో రాత్రి 10 గంటల వరకు తెరవడానికి అనుమతించింది సాధారణ, కిరాణా దుకాణాలు ఇప్పుడు ఐదు రోజులు తెరిచి ఉంటాయి వారంలో శని, ఆదివారాల్లో మాత్రమే వీటిని మూసివేసేయాల్సి ఉంటుంది. కాగా, ఆదివారం నాటికి, రాష్ట్రంలో 3,220 క్రియాశీల కేసులు ఉండగా, రాష్ట్రంలో సంచిత మరణాలు, సంచిత రికవరీలు వరుసగా 7,026 మరియు 3,28,262 గా నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఏఎన్ఐ వెల్లడించింది. గత వారం, ఉత్తరాఖండ్ హైకోర్టు, చార్ ధామ్ యాత్రకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, కుంభమేళా సందర్భంగా ఏర్పడిన ఇబ్బందులు ఈ యాత్ర ద్వారా రాకుండా ఏవిధమైన చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరింది.

అయితే, పర్యాటక కార్యదర్శి దిలీప్ జవాల్కర్ దాఖలు చేసిన అఫిడవిట్ పట్ల అసంతృప్తితో ఉన్న కోర్టు, చార్ ధామ్ యాత్రను జూన్ 22 వరకు నిషేధించామని మాత్రమే ప్రభుత్వం పేర్కొంది, కాని దానిని దశలవారీగా నిర్వహించడం పై స్పష్టత ఇవ్వకపోవడంపై మండిపడింది. యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ సకాలంలో నిర్ణయించాలని, యాత్రికులు నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. పెరుగుతున్న COVID-19 కేసులను దృష్టిలో ఉంచుకుని రాబోయే యాత్రకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను ప్రచురించాలని కోర్టు గతంలో ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది, తీర్థయాత్రను మరో కుంభ మేళాగా మార్చడానికి అనుమతించలేమని కోర్టు అభిప్రాయబడింది.

Also Read: Srisailam Temple Timings: శ్రీశైల దేవస్థానం దర్శన వేళల్లో మార్పులు.. సాయంత్రం 3గంటల వరకు భక్తులకు అనుమతి..

Navabrahma Temples: ఒక్కసారి దర్శిస్తే చాలు పోయిన అదృష్టాన్ని సైతం తిరిగి తెచ్చే ఆలయం