Lunar Eclipse 2025: ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది? భారత దేశంలో కనిపిస్తుందా..! లేదా..! తెలుసుకోండి..
2025 సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ నెలలో ఏర్పడనుంది. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో సూత కాలం భారతదేశంలో చెల్లుబాటు అవుతుందో లేదో తెలుసుకుందాం. ఈ ఏడాది ఏర్పడనున్న చివరి చంద్ర గ్రహణానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోండి..

2025 సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం త్వరలో ఏర్పడనుంది. ఈ చివరి చంద్రగ్రహణం 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సంభవిస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఈ ఏడాదిలో ఒక చంద్ర గ్రహణం, ఒక సూర్య గ్రహణం ఏర్పడినా.. అవి మన దేశంలో కనిపించలేదు. అయితే రెండవ చంద్రగ్రహణం మాత్రం భారతదేశంలో కనిపించనున్నది.
చంద్రగ్రహణం ఒక ఖగోళ సంఘటన. హిందూ మతంలో చంద్రగ్రహణం అనేది ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యత కలిగిన సంఘటన. హిందూ మతంలో గ్రహణం ఏర్పడడానికి ముందు నుంచి సూతక కాలం పాటించబడుతుంది. ఈ సమయంలో అన్ని రకాల పూజలు, శుభ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి.
2025 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న సంభవించనుంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1.26 గంటల వరకు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం వ్యవధి 3.28 నిమిషాలు ఉంటుంది.
సంపూర్ణ గ్రహణం సెప్టెంబర్ 7, 2025న రాత్రి 11:01 గంటలకు ప్రారంభమవుతుంది.
రాత్రి 11:42 గంటలకు సంపూర్ణంగా చంద్రుడు కనిపించడు.
సంపూర్ణ గ్రహణం 8 సెప్టెంబర్ 2025న తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది.
చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూత కాలం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12.19 గంటలకు ప్రారంభమై చంద్రగ్రహణం ముగియడంతో ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1.26 గంటలకు సూతక కాలం ముగుస్తుంది.
2025 సంవత్సరంలో చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. కనుక ఈ గ్రహణ సూతక కాలం భారతదేశంలో కూడా చెల్లుతుంది. ఈ సమయంలో మంత్రాలు జపించండి, దానధర్మాలు చేయడం ఫలవంతం అని నమ్మకం.
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పపడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీనిని చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి రోజున సంభవిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








