Chanakya Niti: విజయవంతమైన జీవితం కోసం మనుషులు కుక్కల నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు ఇవే..
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త. రాజకీయ వ్యూహకర్త. చాణక్యుడు రచించిన అనేక రకాల గ్రంథాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దిగంచాయి. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో మానవులు కుక్కల నుంచి కొన్ని విషయాలను అలవాటు చేసుకోవాలని చెప్పాడు. ఈ రోజు చాణక్యుడు చెప్పిన ప్రకారం.. శునకంలోని కొన్ని అలవాట్లను మనిషి తన జీవితంలో అలవాటు చేసుకుంటే వారు మెరుగైన జీవితాన్నిసంతృప్తికరంగా గడుపుతారని పేర్కొన్నాడు.

ఆచార్య చాణక్యుడు ఒక సామాన్య బాలుడిని సామ్రాజ్యాధిపతిగా మార్చి.. మౌర్య రాజ్యాన్ని స్థాపించిన రాజనీతి కోవిదుడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడు నుంచి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా కొలువుదీరాడు. విష్ణు శర్మ నుంచి కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని పిలుస్తారు. ఈ రోజు చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవుడికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశాడు. అందులో మనుషులు జంతువులు, పక్షుల నుంచి కూడా రకరకాల విషయాలను తెలుసుకోవచ్చు అని పేర్కొన్నాడు. మనిషి కుక్క నుంచి ఈ విషయాలను నేర్చుకోవడం వలన మెరుగైన జీవితం గడుపుతాడని చాణక్యుడు పేర్కొన్నాడు.
కొన్ని రకాల జంతువులను మానవులు ఇష్టంగా పెంచుకుంటారు. అలాంటి జంతువులలో అత్యంత విశ్వాసం ఉన్న జంతువు కుక్క. తమ సొంత ఇంటి పిల్లల్లా కుక్క పిల్లల్ని పెంచుకుంటారు. కుక్కలకు తమ యజమానుల పట్ల విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అవసరం అయినప్పుడు ఓదార్పునిస్తాయి. అదే విధంగా కుక్కలోని ఈ సుగుణాన్ని మనుషులు కూడా ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం నేర్చుకోవా. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు సానుభూతిని చూపించాలి. మద్దతుగా నిలవాలి.
కుక్కలు ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడతాయి. ఈ అలవాటు వాటిని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచుతుంది. ఆరోగ్యం, ఆనందాన్ని కాపాడుకోవడానికి మానవులకు శారీరక శ్రమ, ఉల్లాసం కోసం ఈ అలవాటుని తమ జీవితాల్లో చేర్చుకోవాలని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు.
కుక్కలు తేలికగా నిద్రపోతాయి. ఏదైనా అసాధారణ శబ్దం లేదా కదలిక కనిపించినా వెంటనే అప్రమత్తంగా ఉంటాయి. అదే విధంగా మానవులు కూడా అప్రమత్తంగా ఉండాలి. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా సంభావ్య ముప్పులకు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండాలి.
కుక్కలు చిన్నగా ఉనాయి. బలం లేకున్నా తమ యజమానులను అవసరం అయినప్పుడు రక్షించే సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడతాయి. పెద్ద ముప్పు ఏర్పడినా.. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని.. ప్రతికూలత పరిస్థితిలు ఎదురైతే పారిపోకూడదని చాణక్య సూచించాడు.
కుక్కలు కొత్త విషయాలను అన్వేషించడానికి, తెలుసుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటాయి. అవి ఏదైనా పూర్తిగా అర్థం చేసుకునే వరకు విశ్రాంతి తీసుకోవు. అదేవిధంగా మానవులు ఉత్సుకతను అనుసరించి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం కొనసాగించాలి. ఈ అలవాటు వ్యక్తిగత అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.
కుక్కలు చిన్న చిన్న విషయాలకే ఉత్సాహంగా, ఆనందంగా ఉంటాయి. అది కొత్త వ్యక్తులను కలవడం లేదా కొత్త వాటితో ఆడుకోవడం కావచ్చు. మానవులు కూడా సమస్యల గురించి నిరంతరం చింతించడం కంటే జీవితంలోని చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించడంపై దృష్టి పెట్టాలి.
కుక్కలు వాటి యజమానులకు చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి. ఇవి ఎటువంటి సమస్య ఎదురైనా తమ యజమానిని రక్షించడానికి సిద్ధంగా ఉంటాయి. మానవులు తమ పని, సంబంధాలు, జీవితంలోని ఇతర అంశాలలో కూడా విశ్వాసాన్ని, అంకితభావాన్ని అలవర్చుకోవాలని చాణక్యుడు నొక్కి చెప్పాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.