Chanakya Niti: ఇలాంటి ఆలోచనలు, లక్షణాలున్న వ్యక్తికి వీలైనంత దూరంగా ఉండమంటున్న ఆచార్య చాణక్య .. ఎందుకంటే..
తను జీవితంలో ఏది నేర్చుకున్నాడో, ఆ జ్ఞానం, అనుభవం చాణక్య నీతిలో చక్కగా వివరించాడు. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి తద్వారా వ్యక్తి తన జీవితంలో సులభంగా విజయం సాధించగలడని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు. నీతి శాస్త్రంలో పేర్కొన్న విషయాలు నేటికీ అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. ఈ నేపధ్యంలో కొంతమంది ఆలోచనలు గల వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని.. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడు ప్రాచీన కాలంలో గొప్ప దౌత్యవేత్త. రాజనీతజ్ఞుడు. హ్యుహకర్త. ఆయన రాసిన ఆర్ధిక శాస్రం, నీతి శాస్త్రం చాలా ప్రసిద్ధి చెందాయి. ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో మానవ జీవితంలోని అంశాలను చాలా లోతుగా వివరించాడు. తను జీవితంలో ఏది నేర్చుకున్నాడో, ఆ జ్ఞానం, అనుభవం చాణక్య నీతిలో చక్కగా వివరించాడు. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి తద్వారా వ్యక్తి తన జీవితంలో సులభంగా విజయం సాధించగలడని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు. నీతి శాస్త్రంలో పేర్కొన్న విషయాలు నేటికీ అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. ఈ నేపధ్యంలో కొంతమంది ఆలోచనలు గల వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని.. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
- అధిక కోపం ఉన్న వ్యక్తులతో చాణక్య నీతి ప్రకారం కోపంగా ఉన్నవారు త్వరగా నిగ్రహాన్ని కోల్పోతారు. ఆలోచించకుండా మాట్లాడతారు లేదా ప్రవర్తిస్తారు. అలాంటి వారితో కలసి జీవించడం వల్ల గొడవలు, టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. కనుక అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి.
- అత్యాశగల వ్యక్తి అత్యాశపరులు ఎల్లప్పుడూ ఇతరులను దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారితో స్నేహం చేయడం లేదా వారితో వ్యాపారం చేయడం ఎప్పటికైనా ప్రమాదమే.
- సోమరి వ్యక్తి సోమరులు ఎప్పుడూ తమ పనిని సమయానికి చేయరు.. అంతేకాదు బద్దకంతో ఇతరులకు భారంగా మారతారు. అలాంటి వారి సాంగత్యంలో మీరు సోమరిపోతులు కూడా కావచ్చు.
- అబద్ధాలు చెప్పే వ్యక్తులు దగాకోరులు ఎప్పుడూ నిజం చెప్పరు. వారిని విశ్వసించడం కష్టం. అలాంటి వారితో స్నేహం చేయడం వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది.
- ప్రతికూల ఆలోచనలు కొతమంది వ్యక్తులు ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రతికూలంగా ఆలోచిస్తారు. అదేవిధమా ప్రతికూలంగా మాట్లాడతారు. ఇలాంటి వారితో కలిసి జీవించే వ్యక్తికి కూడా ప్రతికూల ఆలోచనలు వస్తు నిరాశతో నిండిపోయి జీవిస్తారు
- అసూయపరులకు అసూయపడే వ్యక్తులు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడతారు. ఎల్లప్పుడూ ఎదుటి వారి చెడును కోరుకుంటారు. ఇలాంటి వారితో స్నేహం చేయడం వల్ల మీ మనస్సులో కూడా అసూయ కలుగుతుంది. ఇతర విజయవంతమైన వ్యక్తుల పట్ల అసూయ, ద్వేషం కూడా ఏర్పడవచ్చు.
- విమర్శించే వ్యక్తులకు విమర్శించే వ్యక్తులు ఎప్పుడూ ఇతరుల తప్పులను వెతుకుతూ ఎగతాళి చేస్తారు. ఇలాంటి వారితో స్నేహం చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కనుక ఎటువంటి కారణం లేకుండా ప్రతికూల విమర్శలు చేసే వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు. మీ ప్రయోజనం కోసం మీ తప్పును విమర్శించే వ్యక్తి ఎల్లప్పుడూ మీ మంచిని కోరుకుంటాడు. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఇలాంటి విమర్శలను సానుకూల విమర్శ అంటారు.
- తెలివితక్కువ వ్యక్తులతో మూర్ఖుడి నుండి జ్ఞానాన్ని ఆశించడం పనికిరాదు. అలాంటి వారితో కలిసి ఉండడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. కాబట్టి తెలివితక్కువ వ్యక్తితో స్నేహం చేసి సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు