AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhimashankar temple: అత్యంత ప్రశాంతమైన జ్యోతిర్లింగ క్షేత్రం భీమ శంకరం.. శివుడి చెమటతో ఉద్భవించిన నది.. విశిష్టత ఏమిటంటే?

భీమాశంకర జ్యోతిర్లింగం మతపరమైన ప్రాముఖ్యతతో పాటు దీని సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యతతో కూడా ప్రసిద్ధి చెందింది. భీమశంకర జ్యోతిర్లింగాన్ని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే భీమశంకర్ శివలింగం ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. అందుకే ఈ శివలింగాన్ని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించినంత మాత్రాన సర్వపాపాలు నశించి శివుని అనుగ్రహం పొందుతారని నమ్మకం. 

Bhimashankar temple:  అత్యంత ప్రశాంతమైన జ్యోతిర్లింగ క్షేత్రం భీమ శంకరం.. శివుడి చెమటతో ఉద్భవించిన నది.. విశిష్టత ఏమిటంటే?
Bhimashankar Jyotirlinga Temple
Surya Kala
|

Updated on: Jul 19, 2024 | 10:59 AM

Share

హిందూ మతంలో జ్యోతిర్లింగ క్షేత్రాలకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. ఈ క్షేత్రాల్లో శివుడిని కాంతి లేదా జ్యోతిర్లింగం రూపంలో దర్శించుకుని పుజిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకుంటారు. అలాంటి 12 జ్యోతిర్లింగాలలో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం ఆరవ జ్యోతిర్లింగం. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణిలోని దట్టమైన అడవులలో ఉంది. భీమాశంకర జ్యోతిర్లింగం మతపరమైన ప్రాముఖ్యతతో పాటు దీని సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యతతో కూడా ప్రసిద్ధి చెందింది. భీమశంకర జ్యోతిర్లింగాన్ని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే భీమశంకర్ శివలింగం ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. అందుకే ఈ శివలింగాన్ని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించినంత మాత్రాన సర్వపాపాలు నశించి శివుని అనుగ్రహం పొందుతారని నమ్మకం.

భీమశంకర జ్యోతిర్లింగ స్వరూప కథ

భీమశంకర జ్యోతిర్లింగ స్వరూపం గురించిన పురాణ గ్రంథం శివపురాణంలో వివరించబడింది. కుంభకర్ణుడికి ఒక కుమారుడు ఉన్నాడు.. అతని పేరు భీముడు. కుంభకరుని మరణం తర్వాత భీముడు జన్మించాడు. ఈ కారణంగా భీముడికి తన తండ్రి కుంభకర్ణుడు ఎలా మరణించాడో తెలియదు. తన తండ్రి రాముడి చేతిలో మరణించాడని భీముని తల్లి చెప్పింది. తన తండ్రిని చంపిన రాముడి గురించి తెలుసుకున్న అసురుడైన భీముడికి రాముడిపై విపరీతమైన కోపం కలుగుతుంది. దీంతో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. భీముడు తన తండ్రి మరణానికి కారణమైన రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. తనను తాను అత్యంత శక్తివంతంగా మార్చుకోవడానికి భీముడు అనేక సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపెట్టాడు.

భీముని కఠోరమైన తపస్సుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు అతనికి అజేయుడు, అపారమైన శక్తిని కలిగి ఉండే వరాన్ని ఇచ్చాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో గర్వం వచ్చిన భీముడు మరింత క్రూరంగా , నిరంకుశుడుగా మారాడు. దేవతలను ఓడించి హింసించడం, భూమి మీద ప్రజల్లో భయాందోళనలు కలిగించడం ప్రారంభించాడు. అతని క్రూరత్వానికి కలత చెందిన దేవతలు, ఋషులు పరమశివుని ఆశ్రయించారు. తమను భీముడి నుంచి రక్షించమని ప్రార్థించారు.

ఇవి కూడా చదవండి

దేవతల ప్రార్థనలు విన్న శివుడు లోక సంక్షేమం కోసం భీమునితో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. శివుడు భీముని ముందు ప్రత్యక్షమై అతని దౌర్జన్యాలను ఇక నుంచి అయినా ఆపమని ని హెచ్చరించాడు. అయితే భీముడు వర గర్వంతో శివుడి హెచ్చరికను పట్టించుకోకుండా అతనిపై దాడి చేశాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. భీముడు అజేయుడిగా జీవించే వరం పొందినప్పటికీ, శివుని దివ్య శక్తులను తట్టుకుని ఎక్కువ కాలం పోరాడలేక పోయాడు. చివరికి శివుడు చేతిలో భీముడు హతమయ్యాడు.

అసురుడు భీముడు సహారం అనంతరం దేవతలందరూ చాలా సంతోషించారు. శివలింగ రూపంలో అదే ప్రదేశంలో నివసించమని శివుడిని ప్రార్థించారు. శివుడు దేవతల ప్రార్థనలను అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో ఆ ప్రదేశంలో స్థిరపడ్డాడు. అలా ఈ జ్యోతిర్లింగానికి భీమశంకరుడు అనే పేరు వచ్చింది.

భీమశంకర నది శివుని చెమట నుండి ఉద్భవించింది

భీమశంకర దేవాలయం సమీపంలో ఒక నది ప్రవహిస్తుంది. దీని గురించి పురాణాల కథ ప్రకారం రాక్షసుడు భీముడు, శివుని మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, శివుని శరీరం నుండి కొన్ని చెమట చుక్కలు వచ్చి భూమి మీద పడ్డాయట. అలా శివుడి చెమట నుండి ఈ నది సృష్టించబడింది. ఈ నదిని భీమా నది అని పిలుస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు