Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: శత్రువులను ఓడించాలంటే.. అలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు.. ఆచార్య చాణక్యుడి సూత్రాలు!

Chanakya Niti: శత్రువును ఓడించాలంటే.. ఎప్పుడూ కూడా అతడు ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నాడో తెలుసుకుంటూ.. మన ప్లాన్స్‌ను అమలు..

Chanakya Niti: శత్రువులను ఓడించాలంటే.. అలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు.. ఆచార్య చాణక్యుడి సూత్రాలు!
Chanakya Niti
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 26, 2021 | 10:50 AM

ఆచార్య చాణక్యుడు చెప్పిన జీవిత సూత్రాలు పాటించడానికి కష్టంగా ఉన్నా.. అవి మనల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తాయి. జీవితానికి సంబంధించిన ప్రతీ సమస్యకు ఆచార్య చాణక్యుడి దగ్గర ఓ పరిష్కారం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాణక్యుడి జీవిత సూత్రాలను నేర్చుకోవడం, పాటించడం చాలా అవసరం.

ఇదిలా ఉంటే.. శత్రువును ఓడించాలంటే.. ఎప్పుడూ కూడా అతడు ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నాడో తెలుసుకుంటూ.. మన ప్లాన్స్‌ను అమలు చేస్తూ ఉండాలి. మనకు మనమే శక్తివంతులమని భావిస్తూ సైలెంట్‌గా ఉండిపోకూడదు. ఒకవేళ అలా ఉంటే అది అవివేకమని చాణక్య నీతి చెబుతోంది. శత్రువులతో ఎలప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పుడు.? ఎలా.? దాడి చేస్తారో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి మీరు మీ శత్రువులను ఓడించాలంటే.. ఆచార్య చెప్పిన ఈ 4 విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

1. కొంతమంది వ్యక్తులు తమకు తామే బలవంతులుగా భావిస్తూ.. శత్రువును తక్కువ అంచనా వేస్తారు. ఎప్పుడూ ఎలా ఆలోచించకండి అని చాణక్య నీతి చెబుతోంది. ఒకవేళ శత్రువు మీకంటే బలహీనంగా ఉన్నట్లయితే.. అతడు మిమ్మల్ని ఓడించడానికి సరైన అవకాశం కోసం వేచి చూస్తున్నాడని గుర్తించుకోండి. అందుకోసం అతడు మీపై ఎప్పటికప్పుడు నిఘా పెడతాడు. అవకాశం చిక్కినప్పుడు మెరుపు దాడి చేయడానికి సిద్దంగా ఉంటాడు. కాబట్టి మీరు శత్రువును ఓడించాలనుకుంటే, అతడు బలహీనం అని భావించవద్దు.

2. కొందరు వ్యక్తులు తాము చేసే పనులు, ప్రణాళికలు బహిర్గతం చేస్తుంటారు. అలా చేయడం చాలా తప్పు. శత్రువు విషయంలో మీరు రచించే వ్యూహం, లేదా ఏదైనా విషయమైనా ఎంత సీక్రెట్‌గా ఉంటే.. అంత గొప్ప విజయాన్ని అందిస్తుందని మీరు గుర్తించాలి. కాబట్టి మీ ప్రణాళికలను ఎవ్వరితోనూ చర్చించవద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే.. శత్రువు దాన్ని సద్వినియోగం చేసుకుని మిమ్మల్ని ఓడిస్తాడు.

3. ఎవరైనా కూడా తమకు నచ్చని వ్యక్తుల గురించి చాలా చెడుగా మాట్లాడుతుండటం సర్వ సాధారణం. అయితే ఇలాంటి సందర్భాల్లోనే మీ శత్రువు మీ మీద పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తాడు. మీకు నచ్చని వ్యక్తులను అతడి వైపుకు తెచ్చుకుంటాడు. కాబట్టి ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు.

4. రిలేషన్స్ విషయంలో ఎప్పుడూ పరిమితులు దాటవద్దు. ఒకవేళ దాటితే.. అది మీ శత్రువుకు లాభం చేకూరుస్తుంది. మిమ్మల్ని ఓటమి అంచుల్లోకి తీసుకుని వెళ్తుంది.

ఇది చదవండి: Viral Photo: చిరుత ఎక్కడుందో కనిపెట్టండి.. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారు!