చాణక్య నీతి: బిడ్డకు సరైన మార్గం చూపించాలంటే.. ఈ నియమాలను పాటించండి.!

ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు మాత్రమే కాదు.. నైపుణ్యం కలిగిన వ్యూహకర్త, ఆర్ధికవేత్త. ఆయన రాసిన చాణక్య నీతిలో జీవితానికి..

చాణక్య నీతి: బిడ్డకు సరైన మార్గం చూపించాలంటే.. ఈ నియమాలను పాటించండి.!
Chanakya Niti
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 24, 2021 | 9:40 AM

ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు మాత్రమే కాదు.. నైపుణ్యం కలిగిన వ్యూహకర్త, ఆర్ధికవేత్త. ఆయన రాసిన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన ప్రతీ అంశం ఉంటుంది. చాణక్యుడు చెప్పింది పాటించడానికి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ.. ఆయన సూత్రాలు పాటిస్తే.. వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. పూర్తి విశ్వాసంతో ప్రతీ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

ఇదిలా ఉంటే తల్లిదండ్రులు అందరూ కూడా తమదైన శైలిలో పిల్లలను పెంచుతారు. చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం.. పిల్లలు పెరిగే వయస్సు ఆధారంగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తే.. వారికి సరైన మార్గాన్ని చూపించేందుకు దోహదపడుతుంది. ఆచార్య చాణక్యుడు ఈ అంశంపై తన నీతిశాస్త్రంలో ఇంకేం ప్రస్తావించాడు.? పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఐదేళ్లు వచ్చేవరకు తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ తరుణంలో పిల్లలు ఎంతో అమాయకంగా ఉంటారు. ఏది తప్పు.. ఏది ఒప్పు.. అనే అవగాహన వారికి ఉండదు. ఈ వయస్సులో పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా.. అది ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఐదేళ్లు నిండిన చిన్నారులను.. ఏదైనా తప్పు చేసినప్పుడు మందలించాలి. ఎందుకంటే ఈ వయస్సులో పిల్లలు కొంచెంగా విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అందువల్ల, అవసరమైనప్పుడు పిల్లలను లాలించడంతో పాటు, వారిని మందలించాలి.

బిడ్డకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు..

ఆచార్య చాణక్యుడి ప్రకారం, బిడ్డకు 10 నుండి 15 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, అతనితో కాసింత కఠినంగా ఉన్నా ఫర్వాలేదు. ఎందుకంటే ఈ వయస్సులో పిల్లలు మొండిగా ఉంటారు. అందుకే వారితో కఠినంగా ఉండటం అవసరం. అది తప్పు అని చెప్పినా.. పిల్లాడు మారాం చేస్తుంటే.. కఠినంగా ఉండటంతో శిక్షించినా తప్పులేదు. అయితే పిల్లలతో వ్యవహరించేటప్పుడు తల్లిదండ్రులు సంయమనం పాటించాలి. భాషను మితంగా మాట్లాడాలి.

16 సంవత్సరాల వయస్సులో పిల్లలతో ఎలా ప్రవర్తించాలి..

పిల్లలకు 16 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు.. వారిని తిట్టడం, కొట్టడం మానేసి.. వారితో స్నేహితుడిలా ప్రవర్తించండి. ఈ యవ్వన వయస్సు బిడ్డలకు చాలా ముఖ్యమైంది. పిల్లలు చేసిన తప్పును వారు అర్ధం చేసుకునేలా వివరించండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!