Yadadri: ఘనంగా ముగిసిన జయంత్యోత్సవాలు.. మూలమూర్తులకు సహస్ర కలశాభిషేకం
యాదాద్రిలో(Yadadri) స్తంబోద్భవుని జయంత్సుత్సవాలు వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా ముగిశాయి. యాగశాలలో మహాపూర్ణాహుతి, గర్భాలయ మూలవరులకు సహస్ర కలశాభిషేకం వంటి పర్వాలతో యాదాద్రీశుడి సన్నిధిలో....
యాదాద్రిలో(Yadadri) స్తంబోద్భవుని జయంత్సుత్సవాలు వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా ముగిశాయి. యాగశాలలో మహాపూర్ణాహుతి, గర్భాలయ మూలవరులకు సహస్ర కలశాభిషేకం వంటి పర్వాలతో యాదాద్రీశుడి సన్నిధిలో పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం వేడుకలు జరిగాయి. విశ్వశాంతి, లోకకల్యాణార్థమై దీవించేందుకు ఈ పర్వాన్ని చేపట్టినట్లు ఆలయ ప్రధాన పూజారి వెల్లడించారు. సహస్ర కలశాలలో పంచామృతం, జలం, పండ్ల రసాలు, నింపి ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభువులైన మూలవరులకు ఈ విశిష్ట అభిషేక పర్వాన్ని సుమారు రెండున్నర గంటలపాటు చేపట్టారు. మంత్రోచ్చరణల మధ్య జరిపిన ఆవిర్భావ ఘట్ట విశిష్టతను ప్రధాన పూజారి భక్తులకు వివరించారు. స్వయంభువులకు సహస్ర కలశాభిషేకం కొనసాగుతున్న దశలోనూ దర్శనాలను(Visiting in Yadadri) కొనసాగించారు. యాదాద్రికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట ఆలయంలోనూ శ్రీ స్వామి జయంత్యుత్సవాలను నిర్వహించారు. ముగింపు సందర్భంగా మూలవరులను కొలుస్తూ అష్టోత్తర శతఘటాభిషేకం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో శ్రీ స్వామి జయంత్యుత్సవాలను నిర్వహించడం ఇదే మొదటిసారి. మూడు రోజుల పాటు జరిగిన వేడుకలు ఆదివారం నిర్వహించిన నృసింహావిర్భావ ఘట్టంతో ముగిశాయని పూజారులు, అధికారులు వెల్లడించారు.
యాదాద్రిలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి కిటకిటలాడాయి. ఎండ వేడికి భక్తులు తట్టుకోలేకపోతున్నారు. ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు సతమతమవుతున్నారు.ఉదయం 7 గంటలకు బయల్దేరి వచ్చినా.. దాదాపు మూడు గంటలకు పైగా నిల్చొనే ఉన్నామని..కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని భక్తులు వాపోతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
America: ఆస్పత్రిలో 11 మంది మహిళా ఉద్యోగులు ఏకకాలంలో గర్భం.. అక్కడ నీరు తాగడమే కారణం అంటూ కామెంట్స్