Badrinath yatra 2023: ఈ నెల 27న తెరుచుకోనున్న బద్రీనాథ్ తలుపులు, మొదలైన గరుడుడి యాత్ర
బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరవడానికి ముందు గరుడ ఛడ్ పండుగను జరుపుకోవడం సంప్రదాయం. విష్ణువు, గరుడ పర్వతానికి ఈ పండగకు సంబంధం ఉంది. ఈ పండుగ రోజున శ్రీ మహా విష్ణువు గరుడుడి మీద స్వారీ చేస్తూ జోషిమఠ్ నుండి తన పవిత్ర నివాసానికి బయలుదేరతాడు.

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్ హిందూ ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి . ఇక్కడ విష్ణువుని పూజిస్తారు. లోకాన్ని రక్షించే వాడు శ్రీ మహావిష్ణువు అని నమ్మకం. శ్రీ హరి పవిత్ర దేవాలయం తలుపులు ఆరు నెలల తర్వాత ఏప్రిల్ 27, 2023 న తెరచుకోనున్నాయి. సాంప్రదాయ పద్ధతిలో పూజలు అనంతరం బద్రీనాథ్ ఆలయ తలుపులు ఈ సంవత్సరం ఈ నెల 27వ తేదీ ఉదయం 07:00 గంటలకు తెరవబడతాయి. జోషిమఠ్‌లోని నరసింహ ఆలయ తలుపులు తెరవకముందే గరుడ ఛడ పండుగను జరుపుకునే సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం జోషిమఠ్‌లో జరిగే ఈ గరుడ్ ఛడ్ పండగలో విష్ణువు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ రోజు బద్రీనాథ్ ఆరాధనకు సంబంధించిన ఈ సంప్రదాయం గురించి వివరంగా తెలుసుకుందాం.
గరుడ ఆరాధనకు మతపరమైన ప్రాముఖ్యత జ్యోతిర్మఠాధి పతి ముకుందానంద స్వామి చెప్పిన ప్రకారం బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరవడానికి ముందు గరుడ ఛడ్ పండుగను జరుపుకోవడం సంప్రదాయం. విష్ణువు, గరుడ పర్వతానికి ఈ పండగకు సంబంధం ఉంది. ఈ పండుగ రోజున శ్రీ మహా విష్ణువు గరుడుడి మీద స్వారీ చేస్తూ జోషిమఠ్ నుండి తన పవిత్ర నివాసానికి బయలుదేరతాడు. ఈ ఉత్సవంలో, విష్ణువు, గరుడకు సంబంధించిన చిహ్నాన్ని తాడు సహాయంతో తీసుకువస్తారు. హిందూ మత సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పండుగలో గరుత్మంతుడి చెక్క విగ్రహాన్ని ఒక తాడులో కట్టి, మరొక చివర వదిలివేస్తారు.
ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారంటే? ఈ క్షేత్రంలో విష్ణువు బద్రీనాథుడుగా పూజలను అందుకుంటాడు. గరుడ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరించడానికి భారీ సంఖ్యలో వైష్ణవ భక్తులు జోషీ మఠానికి హాజరవుతారు. తాడుకు కట్టిన గరుత్మంతుడి పవిత్ర స్పర్శను పొందిన స్త్రీకి అతని ఆశీర్వాదం లభిస్తాయని.. ఆరోగ్యకరమైన ,అందమైన బిడ్డను పొందాలనే స్త్రీ కోరిక త్వరలో నెరవేరుతుందని స్థానిక ప్రజల విశ్వాసం.




బద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన పూజారి భాస్కర్ డిమ్రి ప్రకారం.. ఈ గరుడ విగ్రహం చాలా పురాతనమైనది. గొప్ప పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పవిత్ర విగ్రహాన్ని గరుడ దేవత అర కిలోమీటరు పొడవైన తాడు ద్వారా బద్రీనాథ్ ఆలయం వైపు ఎగురుతుంది. గరుడ ఛడ్ పండుగ రోజున, జోషీ మఠంలోని నరసింహుడి ఆలయంలో పూజలు, పారాయణం , భజన, కీర్తన మొదలైన మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి.
ఎప్పుడు బద్రనాథ్ ధామ్ తలుపులు తెరవబడతాయంటే గరుడ్ ఛడ్ ఉత్సవం అనంతరం గరుడ్ ఘడ టెహ్రీ గర్వాల్ మహారాజా స్థలంలోని నర్సింహ ఆలయానికి చేరుకుంటుంది. ఈ రోజు కలశ యాత్ర పాండుకేశ్వర్‌కు చేరుకుంది. రేపు బద్రివిశాల్ ధామ్, ఏప్రిల్ 27వ తేదీన రావల్ పూజారులు సాధారణ భక్తుల కోసం బద్రినాథుడు దర్శనం కోసం తలపులు తెరుస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..