Ayodhya Ceremony: రామమందిర ప్రారంభోత్సవ వేళ పలు రాష్ట్రాల్లో సెలవు.. కొన్ని రాష్ట్రాల్లో ‘డ్రై డే’

ఎన్నో శతాబ్దాల కల సాకారం కాబోతోంది. రాములోరి జన్మస్థలమైన అయోధ్య నందు రామమందిరంలో స్వామివారు సాక్షాత్కరం కాబోతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రాతిష్టాపన కార్యక్రమం మరికొన్ని గంటల్లో అత్యంత వైభవంగా జరగబోతోంది. కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. దేశమే కాదు.. ప్రపంచమంతా అయోధ్య వైపు చూస్తోంది. ఇక.. అయోధ్య రామ మందిర్ ప్రాతిష్టాపన నేపథ్యంలో.. దేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించగా.. మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా హాలిడే ప్రకటించారు

Ayodhya Ceremony: రామమందిర ప్రారంభోత్సవ వేళ పలు రాష్ట్రాల్లో సెలవు.. కొన్ని రాష్ట్రాల్లో 'డ్రై డే’
Lord Sri Rama In Ayodhya
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2024 | 7:43 AM

ఎన్నో ఏళ్లుగా కంటున్న కల తీరుతున్న శుభ సందర్భంలో ప్రపంచం మొత్తం అయోధ్యవైపే చూస్తోంది.  అయోధ్య రామమందిర ప్రాతిష్టాపన వేళ పలు రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు తాము ఈ వేడుకలకు దూరం అంటున్నాయి.  ఇంతకీ.. రామమందిర ప్రాతిష్టాపన సందర్భంగా ఎక్కడెక్కడ, ఏఏ ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి.. తెలుసుకుందాం..

ఎన్నో శతాబ్దాల కల సాకారం కాబోతోంది. రాములోరి జన్మస్థలమైన అయోధ్య నందు రామమందిరంలో స్వామివారు సాక్షాత్కరం కాబోతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రాతిష్టాపన కార్యక్రమం మరికొన్ని గంటల్లో అత్యంత వైభవంగా జరగబోతోంది. కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. దేశమే కాదు.. ప్రపంచమంతా అయోధ్య వైపు చూస్తోంది. ఇక.. అయోధ్య రామ మందిర్ ప్రాతిష్టాపన నేపథ్యంలో.. దేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించగా.. మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా హాలిడే ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌లో పబ్లిక్ హాలిడే నోటీసు జారీ చేశాయి ఆయా ప్రభుత్వాలు. అలాగే.. త్రిపుర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వారి విద్యా సంస్థలకు హాఫ్ డే సెలవు ఇచ్చాయి.ఇప్పటికే.. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవును కేంద్రం ప్రకటించింది. ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా హాఫ్‌ డే హాలిడేని డిక్లేర్డ్‌ చేసింది. ఇదిలావుంటే.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, గోవా, మహారాష్ట్రతో సహా మరికొన్ని రాష్ట్రాలు ఇవాళ్టిని ‘డ్రై డే’గా ప్రకటించాయి.

ఇవి కూడా చదవండి

ఈ పవిత్రోత్సవం రోజున మద్యం, మాంసాహార దుకాణాలు మూసివేయబడతాయని వెల్లడించాయి. ఇక.. బీజేపీ పాలిత 10 రాష్ట్రాల్లో పూర్తిగా సెలవు ప్రకటించగా.. మిగతా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం సెలవుకు సంబంధించి సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇదిలావుంటే.. ఇవాళ మధ్యాహ్నం 12:20 గంటలకు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజీత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు. శుభ ముహూర్తం మధ్యాహ్నం 12గంటల 29 నిమిషాల 8సెకన్ల నుంచి 12గంటల 30నిమిషాల 32 సెకన్ల వరకు ఉంటుంది. అంటే ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం 84 సెకన్లు మాత్రమే. ఈ సమయంలోనే.. శ్రీరామ్‌లల్లా విగ్రహానికి ప్రతిష్ఠాపన చేస్తారు ప్రధాని మోదీ.

మరిన్ని అయోధ్య రామ మందిర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!