Miniature Hanuman: ఇంత చిన్న హనుమంతుని రూపం మీరెప్పుడూ చూసి ఉండరు.! పెన్సిల్ మొనపై..
అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతున్న వేళ అనకాపల్లి జిల్లాలోని సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్ తన రామ భక్తిని చాటుకున్నారు. పెన్సిల్ మొనపైన అతి సూక్ష్మ హనుమంతుడి కళా రూపాన్ని తయారు చేశారు. రెండు సెంటీమీటర్ల ఎత్తు, 1.2 సెంటీ మీటర్ల వెడల్పుతో అతి చిన్న హనుమంతుడిని చెక్కారు. ఈ మైక్రో అర్ట్‌ను అయోధ్య రామ మందిరంలోని ఫోటో గ్యాలరీ కోసం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన వెంకటేశ్ గతంలోనూ పెన్సిల్ మొనలపై పలు సూక్ష్మ విగ్రహాలను రూపొందించి అబ్బురపరిచాడు.
అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతున్న వేళ అనకాపల్లి జిల్లాలోని సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్ తన రామ భక్తిని చాటుకున్నారు. పెన్సిల్ మొనపైన అతి సూక్ష్మ హనుమంతుడి కళా రూపాన్ని తయారు చేశారు. రెండు సెంటీమీటర్ల ఎత్తు, 1.2 సెంటీ మీటర్ల వెడల్పుతో అతి చిన్న హనుమంతుడిని చెక్కారు. ఈ మైక్రో అర్ట్‌ను అయోధ్య రామ మందిరంలోని ఫోటో గ్యాలరీ కోసం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన వెంకటేశ్ గతంలోనూ పెన్సిల్ మొనలపై పలు సూక్ష్మ విగ్రహాలను రూపొందించి అబ్బురపరిచాడు. వైజాగ్‌లోని గీతం విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తిచేసిన వెంకటేష్.. ఇప్పటి వరకు 400కి పైగా సూక్ష్మ కళాకృతులను రూపొందించాడు. 100కు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్న సూక్ష్మ కళాకారుడు. 19 ఏళ్లకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. తాజాగా యూఎస్ఏలోని న్యూజెర్సీ ప్రభుత్వం నుంచి ఆర్టిస్ట్ సర్టిఫికేషన్ అందుకున్నాడు వెంకటేష్. తాజాగా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పెన్సిల్‌పై హనుమంతుడి విగ్రహాన్ని రూపొందించినట్టు వెల్లడించాడు. ఈ హనుమంతుడి విగ్రహం తయారీకి 4 గంటల సమయం పట్టిందని చెప్పాడు వెంకటేష్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

