Astro Tips: ఎంత కష్టపడినా సక్సెస్ అందుకోలేకపోతున్నారా? ఈ 4 జ్యోతిష్య పరిహాలు చేస్తే అదృష్టం వరిస్తుంది..!
Astro Tips: వ్యక్తికి సంబంధించి విధి, కర్మలో గ్రహాలు, నక్షత్రరాశులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గ్రహాల స్థితి సరిగ్గా లేకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి విజయం లభించదు.
Astro Tips: వ్యక్తికి సంబంధించి విధి, కర్మలో గ్రహాలు, నక్షత్రరాశులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గ్రహాల స్థితి సరిగ్గా లేకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి విజయం లభించదు. అయితే, ఇలాంటి సమస్యలకు జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలను తొలగించవచ్చునని జ్యోతిష్య నిపుణలు చెబుతున్నారు. ఈ నివారణలు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమలో విజయాన్ని అందిస్తాయని చెబుతున్నారు. ఇంట్లో ఆనందం, శాంతి కూడా వస్తుంది. ప్రత్యేకించి ఏదైనా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, ఈ జ్యోతిష్య నివారణలు చాలా ప్రభావవంతంగా ఉంటాయంటున్నారు. మరి ఆ జ్యోతిష్య నివారణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్య చిట్కాలు..
1. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ముందుగా మీ రెండు చేతుల అరచేతులను చూసుకోవాలి. ఆ తరువాత ఆ రెండు చేతులను కలిపి రాపిడి చేయాలి. ఇప్పుడు ముఖంపై రెండు అరచేతులను మూడు లేదా నాలుగు సార్లు రాయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అరచేతి పైభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి, దిగువ భాగంలో విష్ణువు ఉంటారు. ఉదయాన్నే వారి దర్శనం పొందడం వలన అదృష్టం వరిస్తుంది.
2. శనివారం నాడు శని ఆలయంలో ఆవనూనె దీపం వెలిగిస్తే ఉద్యోగానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో ఉన్నట్లయితే, మీ కార్యాలయంలో వ్యాపార వృద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేయాలి. దీని ప్రభావంతో ధనలాభం, సంతృప్తి లభించి ఆర్థిక నష్టాల సంక్షోభం తొలగిపోతుంది.
3. కుటుంబ వివాదాలు, తగాదాలతో బాధపడుతుంటే.. ఉప్పునీటితో ఇంటిని తుడవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ పరిహారం చేయడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూల శక్తి వస్తుంది. దీంతో పాటు ఇంటి సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.
4. అదృష్టం కలగాలంటే.. ప్రతిరోజూ చీమలకు చక్కెరతో కలిపిన పిండిని వేయాలి. అంతే కాకుండా చేపలకు పిండి మాత్రలు తినిపించడం వలన కూడా భాగ్యం కలుగుతుంది. అమ్మవారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అంతే కాకుండా ప్రతిరోజూ సాయంత్రం రావి ఆకులపై పాలు కలిపిన నీళ్లను నైవేద్యంగా పెట్టి, దాని దగ్గర దేశీ నెయ్యితో దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..