Lord Shiva Mantra: సోమవారం నాడు ఈ మంత్రాలు చదవండి.. సమస్యలన్నీ తొలగిపోతాయ్..!

|

May 14, 2023 | 5:10 PM

‘సోమవారం’ ఆది దేవుడు పరమేశ్వరుడికి అంకితం చేయడం జరిగింది. సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శువుడిని భోలా శంకరుడు అంటారు. భక్తుల పిలవగానే పలుకుతాడని, వారి కోరికలను తీరుస్తాడని ప్రతీతి. అయితే, శివుడి ఆరాధానలో వివిధ వస్తువులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా శివుడు అభిషఏక ప్రియుడు..

Lord Shiva Mantra: సోమవారం నాడు ఈ మంత్రాలు చదవండి.. సమస్యలన్నీ తొలగిపోతాయ్..!
Lord Shiva
Follow us on

‘సోమవారం’ ఆది దేవుడు పరమేశ్వరుడికి అంకితం చేయడం జరిగింది. సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శువుడిని భోలా శంకరుడు అంటారు. భక్తుల పిలవగానే పలుకుతాడని, వారి కోరికలను తీరుస్తాడని ప్రతీతి. అయితే, శివుడి ఆరాధానలో వివిధ వస్తువులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా శివుడు అభిషఏక ప్రియుడు.. ఆయనకు అభిషేకం చేస్తే వెంటనే ప్రసన్నుడవుతారని విశ్వాసం. తద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. ఇక వేద మంతాల పఠనం చాలా శక్తివంతమైనదిగా పరిగణనించడం జరుగుతుంది. శక్తి వంతమైన శివ మంత్రాలను పఠించడం ద్వారా కుటుంబ సమస్యలు, వ్యాధులు, ఇతర బాధలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. మరి ఆ మంత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శివ నమస్కార మంత్రం..

ఓం నమః శంభవే ఛ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ|| ఓం ||

పంచాక్షరీ మంత్ర..

ఓం నమః శివాయః

ఇవి కూడా చదవండి

శివ నామావలి మంత్ర..

శ్రీ శివాయ నమః
శ్రీ శంకరాయ నమః
శ్రీ మహేశ్వరాయ నమః
శ్రీ రుద్రాయ నమః
ఓం పర్వతీపతయే నమః
ఓం నమో నీలకంఠాయ నమః

మహా మృత్యుంజయ మంత్రం..

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

శివ గాయత్రీ మంత్రం..

ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి
తన్నః శివః ప్రచోదయాత్॥

శివ మంత్రం ప్రయోజనాలు..

సోమవారం నాడు ఈ శివ మంత్రాలను పఠించడం ద్వారా అన్ని రకాల రోగాలు, దోషాలు, కష్టాలు తీరుతాయని విశ్వాసం. ఈ మంత్రాలను పఠించడం ద్వారా.. పితృ దోషం, కాలసర్ప దోషం, రాహు కేతు, శని బాధల నుండి ఉపశమనం పొందుతారు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం కష్టంగా ఉన్నవారు.. చిన్న మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అది నయం కాని రోగాలను కూడా నయం చేస్తుంది. ఈ మంత్రాలను పఠించడం ద్వారా మోహము, క్రోధము, ద్వేషము, దురాశ, భయము, వ్యాకులత అన్నీ నశిస్తాయి. ఈ మంత్రం మనిషిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

ఈ శివ మంత్రాలను పఠించడం ద్వారా శరీర సంబంధిత రుగ్మతలన్నీ నశిస్తాయి. ఈ మంత్రాలు ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతతో పాటు స్థిరత్వాన్ని కలిగిస్తాయని విశ్వాసం. వీటిని జపించడం ద్వారా.. జీవితంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత గ్రంధాలు, వేద పండితులు తెలిపిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..