- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti difficult problems can be solved easily by following these tips of chanakya in telugu
Chanakya Niti: జీవితంలో ఎటువంటి క్లిష్ట సమస్యలు ఎదురైనా చాణక్యుడు చెప్పిన ఈ విధానాలు పాటించి చూడండి..
జీవితంలో కష్ట సమయాలను సులభంగా ఎలా అధిగమించాలో లేదా క్లిష్ట సమస్యలను సులభంగా ఎలా పరిష్కరించాలో చాణక్యుడు కొన్ని ముఖ్యమైన విధానాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. వాటిలో కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం.
Updated on: May 14, 2023 | 1:16 PM

ప్రతి వ్యక్తి జీవితంలో నిరంతర ఆనందం ఉండటం సాధ్యం కాదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఆచార్య చాణక్యుడు తన విధానాలలో అలాంటి కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా సరే తమ కష్టాలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు ఈ చాణక్య సూత్రాలను జీవితంలో విద్య సహా ఏ వివిధ అంశాలోనైనా వర్తింపజేస్తే.. ఎటువంటి సవాల్ ఎదురైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు.

సహనం, క్షమాపణ: వివాహ బంధంలో సహనం, క్షమాపణ గుణం అతిముఖ్యం. ఈ గుణాలు ఎటువంటి భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరిచే గొప్ప గుణం. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తిచూపకుండా.. ఓపికపట్టండి .. తప్పు జరిగినప్పుడు క్షమించండి. మనోవేదనలను విడిచి పెట్టండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది.

మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.





























