Young Women Worship: గర్భిణీ స్త్రీలు పూజలు చేయవచ్చా..లేదా..? శాస్త్రం వెనుక పరమార్థం ఏమిటి..? తెలుసుకుందాం..

|

Jan 11, 2023 | 10:56 AM

సహజంగానే స్త్రీలకు భక్తి భావం ఎక్కువగా వుంటుంది. దేవుని పూజ కోసం పూలు కోయడం.. వాటిని మాలగా కట్టి దైవానికి సమర్పించడంలో వాళ్లు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతుంటారు. పూజలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి..

Young Women Worship: గర్భిణీ స్త్రీలు పూజలు చేయవచ్చా..లేదా..? శాస్త్రం వెనుక పరమార్థం ఏమిటి..? తెలుసుకుందాం..
Pregnant Women And Puja
Follow us on

సహజంగానే స్త్రీలకు భక్తి భావం ఎక్కువగా వుంటుంది. దేవుని పూజ కోసం పూలు కోయడం.. వాటిని మాలగా కట్టి దైవానికి సమర్పించడంలో వాళ్లు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతుంటారు. పూజలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి స్థానికంగా ఉన్న దేవాలయాలన్నీంటికి వెళుతూ వుంటారు మహిళలు. శ్రావణ, కార్తీక మాసాల్లో అయితే వాళ్లు మరింత తీరికలేకుండా పూజలలో నిమగ్నులై వుంటారు. మరి అలాంటి యువతులు తాము గర్భావతిగా ఉన్నప్పుడు పూజలు చేయవచ్చా..?లేదా..? అనే సందిగ్ధంలో పడుతుంటారు.

అయితే ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం కూడా మన శాస్త్రాలలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలనీ, కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని శాస్త్రం చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం, పుణ్యక్షేత్రాల దర్శనం వంటివి చేయకూడదని తెలుసుతోంది.

దాగివున్న పరమార్థం ఇదే..

కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం.. కోటి స్తోత్రాలు చదవడంక న్నా ఒకసారి జపం చేయడం కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. గర్భవతులకకు పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు. పూజల పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే సదుద్దేశంతోనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి.. లేదా మెట్లతో ఉంటాయి. ఇంకా అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన గర్భవతులు ఇబ్బందిపడే అవకాశం ఎక్కువగా ఉన్నందునే ఈ నియమాన్ని విధించినట్టు మనం గ్రహించాలి. ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది కనుక ధ్యానం చేయడమే మంచిదని పండితులు, ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..